ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకొని శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీగిరి క్షేత్రం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో కిటకిటలాడుతుంది. శిఖరేశ్వరం, పాలధార, పంచదార, హఠకేశ్వరం, సాక్షి గణపతి ఆలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. భక్తులు శ్రీశైల మల్లన్నను ఒక్కసారైనా దర్శించుకుంటే తమ పాపాలు హరించిపోతాయని విశ్వసిస్తారు. 
 
మల్లన్నను సేవించిన వారిలో తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఉన్నారు. 1959లో బాబూ రాజేంద్రప్రసాద్ శ్రీశైలానికి రాగా 1963లో జవహర్ లాల్ నెహ్రూ శ్రీశైలానికి వచ్చారు. పుట్టపర్తి సత్యసాయిబాబా 1962లో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. 1967లో శృంగేరి, కంచి పీఠాధిపతులు శ్రీగిరికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. 
 
1970లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మల్లన్న క్షేత్రాన్ని సందర్శించారు. 1977లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శ్రీశైలానికి వచ్చారు. ఆ తరువాత కాలంలో శ్రీశైలానికి వచ్చి స్వామి, అమ్మవార్లను నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహా రావు దర్శించుకున్నారు. 
 
2012లో శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి, 2013లో శారదాపీఠం పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి మల్లన్న క్షేత్రాన్ని సందర్శించారు. 2019 సంవత్సరం డిసెంబర్ నెల 22వ తేదీన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: