హిందూ దేవుళ్ళ గురించి భారతీయులకు తెలియని ఎన్నో రహస్యాలు ఇతర దేశాలలో నిక్షిప్తమయ్యి ఉన్నాయి. వందల ఏళ్ళ క్రితమే విదేశాలలో హిందూ దేవుళ్ళని పూజించారనే విషయాలు ఇప్పుడు ఆధారాలతో సహా బయల్పడుతున్నాయి. ముఖ్యంగా పరమశివుడుని విదేశీయులు అత్యధికంగా పూజిస్తారనే విషయం చాలా మందికి తెలియదు. దీనికి నిదర్శనం ఐర్లాండ్ లో ఉన్న అత్యంత పురాతనమైన శివలింగం.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=IRELAND' target='_blank' title='ireland-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ireland</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SHIVA' target='_blank' title='shiva-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>shiva</a> linga

ఐర్లాండ్ లోని మీత్ కౌంటీ లో తారా పర్వతాలలో కొలువై ఉన్న పొడువాటి శివలింగ వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. పొడవాటి శివలింగం మధ్యలో రాతి ఇటుకుల పరచినట్టుగా ఉండే ఈ శివలింగం ఇక్కడ విశేషంగా పూజలు అందుకుంటోంది.వందల ఏళ్ళ క్రితమే ఈ శివలింగాన్ని గుర్తించారు. ఈ శివలింగాన్ని స్థానికులు లియో ఫిల్ అని వారి బాషలో పిలుస్తారు. ఈ శివలింగం చరిత్రని పరిశీలిస్తే..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=IRELAND' target='_blank' title='ireland-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ireland</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SHIVA' target='_blank' title='shiva-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>shiva</a> linga

క్రీ. శ..1632 మధ్య కాలంలో ఫ్రెంచ్ సాధువులు రచించిన  “ది మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్” అనే పుస్తకంలో ఈ శివలింగానికి సంభందించిన వివరాలు  కొన్ని ఉన్నాయి.   తుధాది అనే వర్గానికి చెందిన ఓ నాయకుడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని తెలుస్తోంది. అంతేకాదు క్రైస్తవులు ఈ శివలింగాన్ని పునరుత్పత్తికి చిహ్నంగా కొలిచే వారట. అలాగే ఎంతో మంది ఐరిష్ కి చెందిన రాజులు ఈ శివలింగం వద్దే పట్టాభిషేకాలు చేసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ శివలింగాన్ని ధ్వంసం చేయడానికి ఎన్నో సార్లు ప్రయత్నాలు జరిగినా సరే అవేమి సఫలం కాలేదని చరిత్ర చెబుతోంది.  2012 లో ఓ వ్యక్తి ఏకంగా ఈ శివలింగం పై సుమారు 12 సార్లు దాడి చేసినా ,2014 లో కొందరు ఈ శివలింగం పై కొన్ని రకాల రసాయనాలు పోసినా చెక్కు చెదరలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: