శివ లింగం గురించిన అనుమానాలను ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా చెప్పారు.. ఈ రోజుల్లో చాలా మందికి ఒక అనుమానం ఉంది. అది ఏంటంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు అంటా, ఒకవేళ ఉంటే రోజు అభిషేకాలు చేయాలి. లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి అని అపోహ ఉంది. శివలింగం గురించి ఎవరు పడితే వారు ఎలా చెబుతారు.

 

కానీ.. చెబితే శివమహాపురాణం చెప్పాలి. శివలింగం గురించి శివమహాపురాణం ఏమి చెబుతోందంటే, బొటనవేలు అంత శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి. శివాలయం లేని స్మశానం కూడా ఉండకూడదు. ఎందుకంటే ఉగ్ర భూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయి.

 

శివాలయంలో శివలింగం తప్పక ఉంటుంది. అంటే స్మశానంలో కూడా శివలింగం ఉంటుంది. స్మశానంలోనే శివలింగం ఉంటే మీ ఇంట్లో ఉండకూడదా? ఎవరు పడితే వారు ఏదో ఏదో చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ల అర్థ జ్ఞానంతో, వాళ్లు వృద్ధి లోకి రారు.. ఇంకొకరిని వృద్ధిలోకి రానివ్వరు. ప్రతి ఇంట్లో బొటనవేలు అంత శివలింగాన్ని తప్పక ఉంచుకోవాలి. ప్రతీ రోజు మంచి నీళ్ళతో అభిషేకం చేయాలి. లేదా ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడకట్టి ఆ నీళ్ళతో చేయాలి.

 

ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితిలో ఉన్నా, చెయ్యకున్న పరవాలేదు. అభిషేకం... చేసేటప్పుడు "మహా మృత్యుంజయ" మంత్రం చదవచ్చు లేదా నమశ్శివాయ నమశ్శివాయ అంటూ చేసిన సరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: