చంద్రబాబు ప్రభుత్వంలో విధానాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, భూముల లావాదేవీలపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన సిట్ కు వైసీపీ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ హోదా కల్పించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం సీఆర్‌పీసీ లోని సెక్షన్ 2 ను అనుసరించి కేసు నమోదు సహా దర్యాప్తు చేసే అధికారమూ ఈ సిట్ కు అప్పగించింది.

 

 

ఈ సిట్ పరిధిని ఎంత వరకూ ఇచ్చారో తెలుసా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో సంప్రదింపులు, సమన్వయం చేసుకునే నోడల్ ఏజెన్సీగానూ వ్యవహరిస్తుంది. దర్యాప్తు చేస్తున్న అంశాలకు సంబంధించి ఏ వ్యక్తినైనా, ఏ అధికారినైనా పిలిపించి వాంగ్మూలం నమోదు చేసే అధికారాన్నీ సిట్ కు ప్రభుత్వం కల్పించింది.

 

అంతే కాదు.. దర్యాప్తు చేస్తున్న అంశాలు, భూముల లావాదేవీలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించవచ్చని చెప్పింది. అయితే ఇదంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా జరగుతున్న కుట్రేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విశేష అధికారాల కారణంగా చంద్రబాబును ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని.. లేదా విచారణ పేరుతో పిలిపించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

ఇక తెలుగుదేశం అభిమాన మీడియా మొత్తం ఈ సిట్ కేవలం చంద్రబాబును రాజకీయంగా వేధించడం కోసమే పని చేస్తుందని రాసుకొస్తోంది. ప్రభుత్వం మాత్రం మంత్రి వర్గం ఉపసంఘం నినేదిక ఆధారంగా సిట్ వేసిందని బాధితులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: