అమ్మవారిని రాజా విక్రమాదిత్యుడు ఆరాధించాడు. అయితే ఆ అమ్మవారు కావేరి నదిలో పెట్టెలో వచ్చి ప్రస్తుతం కుంభకోణానానికి దగ్గరగా ఉన్న తిరుపడల వనం వద్ద కావేరి ఒడ్డుకు చేరుకొంది. ప్రజలంతా కలిసి అమ్మవారిని అక్కడికి దగ్గర్లో ఉన్న ఈశ్వరుడి ఆలయంలో ప్రతిష్టించి పూజిస్తున్నారు. పెట్టెలో అమ్మవారు ఉండటం వల్లే ఆమెను పెట్టికాళి అమ్మ అని పిలుస్తారు. వారానికి మూడు రోజులు మాత్రమే అమ్మవారి దర్శనానికి వీలవుతుంది. ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ఈశ్వరుడిని సుందరేశ్వరుడని పిలుస్తారు. ఈయన దర్శనానికి ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఇంద్రుడు ఐరావతం మీద ఇక్కడకు వస్తాడని చెబుతారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ దేవాలయం గురించి...

 

రాజా విక్రమాదిత్యుని ఆరాధ్య దైవం ఉజ్జయినీలోని కాళీ మాతా అమ్మవారు. అయితే ఆ రాజు చివరి రోజుల్లో ఆ మాత రెండుగా చీలిపోయిందని చెబుతారు. అలా చీలిపోయిన విగ్రహాన్ని ఒక పెట్టెలో పెట్టి కొంతమంది బ్రాహ్మణులు దక్షిణ దిశగా సాగిపోతూ ఉంటారు. ఇలా వెలుతున్నవారికి కావేరి నది అడ్డం వస్తుంది. అదే సమయంలో ఆ బ్రాహ్మణుల చేతిలో ఉన్న పెట్టే కావేరి నదిలోకి పడిపోతుంది. అలా నదిలో కొట్టుకొచ్చిన పెట్టే ప్రస్తుతం కుంభకోణానికి దగ్గరగా ఉన్నా తిరుపడలవనం అనే ప్రాంతం వద్ద ఒడ్డకు చేరింది.

 

ఈ విషయం గ్రామస్తులకు తెలిసి తండోపతండాలుగా అక్కడికి చేరుకొన్నారు. అయితే ఆ పెట్టెలో నుంచి కాంతిపుంజాలు వస్తుండటంతో మొదట్లో ఎవరూ ఆ పెట్టేను తెరవడానికి సాహసించలేదు. అటు పై ఒక అశీరవాణి సూచన మేరకు ఒక చిన్న పాప ద్వారా ఆల పెట్టెను తెరిపించారు. అప్పుడు ఆ చిన్నపిల్లతో పాటు మిగిలిన వారికి అమ్మవారు కాళీ రూపంలో దర్శనమిచ్చారు. ఇక ఆ పెట్టను ప్రస్తుతం సుందరీశ్వర్ ఆలయంలో పెట్టి పూజలు చేయసాగారు. ఇదిలా ఉండగా ఆ పెట్టే చాలా పెద్దది. పూర్వం ఇళ్లలో భోషాణాలు ఉన్న పరిమాణంలో అమ్మవారు ఉంటారు.

 

ఎర్రని మొహం, నొసటన వీభూతి, తిలకం, నోట్లో రెండు కోరలు, ఎనిమిది చేతులు ఉన్నాయి. కుడివైపు చేతుల్లో శూలం, డమరుకం, కొక్కెం తదితర ఆయుధాలతో పాటు చిలుక కూడా ఉంది. అదే విధంగా ఎడమ వైపు చేతుల్లో పాశం, డాలు, గంట, పెర్రె ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: