హిందూ మతంలో శక్తికి ప్రతిరూపాలై ముగ్గరు దేవుళ్ళలో శివుడు ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. ఇక మ‌న భార‌త‌దేశంగా శివాల‌యాలు చాలా చోట్ల ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే శివుడికి అంకితం చేసిన హిందూ దేవాలయం భారతదేశంలోని తమిళనాడులోని తంజావూరులో ఉంది. బృహదేశ్వర ఆలయం తమిళుల అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రధాన ఉదాహరణ మరియు ఇది చోళ రాజవంశంలో నిర్మించబడింది. తంజావూర్ లోనే కాదు... దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆలయం ఇది.

 

ఈ ఆలయంలో సుమారు 12 అడుగుల ఎతైన శివలింగం సాక్షాత్కరిస్తూ భక్తులను ఆధ్యాత్మిక లోకాల్లో విహరింపజేస్తూంటుంది. అందుకు తగ్గట్టుగా.. ఆలయ ముఖ ద్వారంలో 12 అడుగుల మహానంది క్షేత్ర పాలకునిగా.. ద్వార పాలకునిగా పర్యవేక్షిస్తూండటం విశేషం. బృహదేశ్వరాలయంలో మనకు తెలియని ఒక ప్రత్యేక ఉంది అది ఏమిటంటే- గోధూళి వేళ ఈ ఆలయ ‘ఛాయలు' కనిపించవు. సంవత్సరం పొడవునా.. ఏ రోజూ సాయంత్రం వేళ ఆలయ నీడలు భూమీద పడకపోవటం అంతుచిక్కని రహస్యం. శాస్త్ర పరిశోధకులు.. పురాతత్వ శాస్తజ్ఞ్రులు ఏ రీతిన చూసినా.. ఇప్పటికీ వీడని మిస్టరీ గానే మిగిలింది.

 

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ ఆల‌యం 25 టన్నుల బరువున్న ఒకే గ్రానైట్ శిలతో తయారు చేయబడింది. అయితే వందల మైళ్ల దూరం వరకూ ఎక్కడా గ్రానైట్ అనేది కనిపించదు. గ్రానైట్ క్వారీల నుంచీ ఇక్కడి రాళ్లను ఏ విధంగా తీసుకువచ్చారో? ఎంత కాలం పట్టిందీ?? లాంటి ప్రశ్నలకు సమాధానం లేదనే చెప్పాలి. గ్రానైట్‌ పై శిల్పాలను మలచటం కష్టంతో కూడుకొన్న పని. అటువంటిది అంతదూరం నుంచి రాళ్లను తీసుకొచ్చి.. ఇక్కడ ప్రతిష్ఠించటానికి ఆనాటి శిల్పులు,కళాకారులు ఎంత శ్రమ పడ్డారో?? ఆలయ నిర్మాణానికి ఏడేళ్ల కాలం పట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: