తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. ఇది ఎంత పెద్ద పుణ్య‌క్షేత్ర‌మో ఇక్క‌డి మ‌హ‌త్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితలవుతారు. మళ్లీమళ్లీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు. రోజూ లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులకు దర్శనమిచ్చే వేంకటేశ్వర స్వామి ద‌ర్శ‌నం కూడా అంత సుల‌భం కాదు. దాదాపు 11 టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతుంటారు. మరి, తిరుమల గురించి మరిన్ని విశేషాలు ఈ శీర్షిక‌లో చూద్దాం.

 

 గర్బగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు, పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న, ఆకులు, పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు 22 కిమీల దూరంలో ఉంది. ఇక్కడి గ్రామస్థులు చాలా చాలా సంప్రదాయ బద్ధంగా ఉంటారు. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతుంటారు. అయితే, ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు. కేవలం ఆ గ్రామానికి చెందినవారు మాత్రమే ఆ గ్రామంలో అడుగుపెట్టాల‌ట‌. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు వుంటుంది. ఇది అస్సలు చిక్కు పడదని అంటారు. శ్రీవారు భువి మీదకు వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోతారు. ఇది తెలిసిన నీలా దేవీ అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకు ఇస్తుంది. ఇందుకు ఆయన అంగకరించి జుట్టు కోల్పొయిన ప్రాంతంలో అతికిస్తారు. అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం అనవాయితీగా వస్తోంది.

 

బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్వారు గుణపంతో కొడతాడు. దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సంప్రదాయంగా వస్తోంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది. స్వామివారు గర్భగుడి మధ్యలో వున్నట్లు కనిపిస్తారు. అయితే, ఆయన గర్భగుడి కుడి వైపునకు ఉంటారు. స్వామి వారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తుంది. స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది. స్వామివారిని రోజూ కింద పంచె, పైన చీర తో అలంకరిస్తారు.  సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు. అయితే, శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు. చిత్రం ఏమిటంటే ఆ పూలు.. తిరుపతికి దాదాపు 20 కిమీల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: