స‌హ‌జంగా ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని అంద‌రూ న‌మ్ముతారు. మ‌రియు ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులవారు తప్పక ఉంటార‌ని కూడా అంటారు. హనుమంతుడు హిందూ గ్రంథాలలో రామాయణంలో అత్యంత ముఖ్యమైన పాత్రలలో ఒకటి. ఇతనిని వాయుపుత్రుడు, కపివీరుడు, అంజనాదేవి కుమారుడు, రాముని పరమభక్తుడు అని అనేక పేర్లతో పిలుస్తారు. హనుమంతుణ్ణి శక్తిదేవత అని కూడా పిలుస్తారు. రామరావణ యుద్ధ సమయంలో ఆయన పెద్దగా ఎదిగి భయంకర రూపంతో రాక్షస సంహారం చేశాడని చెబుతారు. 

 

అందువల్ల పెద్ద ఆకారంలో హనుమంతుని విగ్రహాలు నిర్మించడం జరుగుతోంది. దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆంజనేయ విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. అందులో విజయవాడలోని వెలసిన అతి ఎత్తైన వీరఅభయాంజనేయ విగ్రహం కూడా ఒక‌టి. భారీ రూపం, అత్యంత ఎత్తైన విగ్రహం, 135 అడుగుల ఎత్తు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇదేనని చెబుతారు. ఇక్కడి విగ్రహం బరువు 2,500 టన్నులు. నిర్మాణ కాలం 25 నెలలు. ఈ విగ్రహం పాదమే ఆరడుగుల ఎత్తులో ఉంటుంది. విగ్రహం చేతిలోని గద చుట్టుకొలత 20 అడుగులు. 

 

కోటిన్నర రూపాయల వ్యయం తో నిర్మించినారు. 2003 సద్గురు శ్రీ శివానందమూర్తిగారు ఆలయ సముదాయాన్ని ఆవిష్కరించారు. దుస్టశక్తులను దూరం చేసే మహిమాన్వితుడు ఈ వీరహనుమాన్ యాత్రికులు, భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్న ఆ ఆలయమే పరిటాల ఆంజనేయ దేవాలయం. కృష్ణా జిల్లాలో కంచిక చర్ల మండలంలోని పరిటాల గ్రామంలో ఈ భారీ విగ్రంగా ఉంది. ఇక ఈ పరిటాల గ్రామానికి మరో చరిత్ర కూడా ఉంది, గ్రామం సమీపంలో వజ్రాల గనిలో ప్రపంచ ప్రఖ్యాతి చెందని వజ్రాలైన కోహినూర్, గోల్కొండ, పిట్, ఆర్లాఫ్, నిజాం మొదలైన పేర్లు కలిగిన వజ్రాలు ఇక్కడే దొరికాయట. వీటి విలువ, ఆకర్షణ కారణంగా ఇవన్నీ సుప్రఖ్యాతమైనాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: