హోలీ.. రంగు రంగుల పండుగ.. అన్ని రకాల ఆనందాలు ఈ హోలీ పండుగలోనే మనకు దొరుకుతాయి. ఇంకా ఈ పండుగను కుల, మతం, పేద.. ధనిక అనే బేధం లేకుండా ఎంతో సంబరంగా ఈ పండుగను కరుపుకుంటారు. అలాంటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు అనేది ఎవరికైన తెలుసా? తెలియకపోతే ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

చాలామందికి ఈ కథ తెలిసే ఉంటుంది.. రాక్షస రాజు హిరణ్యకశపుడు కుమారుడు ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. లేచిన.. పడుకున్న.. విష్ణు మూర్తినే స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడుకి నచ్చదు. దీంతో విష్ణు చింతనతో కాలం గడుపుతున్న ప్రహ్లాదుణ్ణి చంపేయాలని హిరణ్యకశపుడు నిర్ణయంచుకొన్నాడు. 

 

దీంతో ఒకరోజు హిరణ్యకశపుడు తన సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న వరంతో ప్రహ్లాదుణ్ణి మంటలకు ఆహుతి చేయమని చెబుతాడు. ఆ హోలీక తన సోదరుని కోరిక తీర్చడానికి ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. కానీ విష్ణుమాయవల్ల హోలిక ఆ మంటల్లో కాలి బూడిదైపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం సజీవుడై తిరిగివస్తాడు.

 

దీంతో హోలిక దహనమైన రోజు కనుక హోలీ పండుగను చేసుకొంటారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలిక దహనం నిర్వహిస్తారు. ఇంకా ఈ హోలీ పండుగను ఒక్క భారత దేశంలోనే కాదు.. నేపాల్, బంగ్లాదేశ్ లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. చెప్పాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ హోలీ పండుగ చాలా అరుదుగా చేసుకుంటారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: