కాశీ లేదా వారాణసి భారతదేశం అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. ఇక కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి. అలాగే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. 

 

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలో ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది. అయితే వారణాశిలోని సింధియా ఘాట్ కు సమీపంలో లీనిన్ టవర్ ఆఫ్ పైజా వలె ఒక వైపుకు వాలిపోయిన ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ దూరం నుంచి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇది అగ్ని దేవుని జన్మ స్థలమని పురాణ కథనం కూడా ఉంది.

 

మ‌రి ఈ టెంపుల్ ఇలా వాలడానికి కారణం ఏమిటన్న విషయం ఎవరూ చెప్పలేక పోతున్నారు. అయితే ఈ టెంపుల్ వాస్తవంగా 1830 లో నిర్మించినప్పటికీ అక్కడి ఘాట్ కారణంగా నదిలో మునిగిందని చెప్తారు. కానీ, ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ప్ర‌స్తుతం ఈ శివా టెంపుల్ ను మూసేశారు. కాబ‌ట్టి ఈ టెంపుల్‌ లోపలికి వెళ్లాలంటే కుదరదు. అయితే ఈ టెంపుల్ ఎలా మునిగింది? ఎందుకు మునిగింది? అనేది ఇప్ప‌టికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: