హిందూ మతంలో సోమవారం శివునికి ప్రీతికరముగా భావిస్తాము. శివ అనే పదం శుభప్రదం మరియు మంగళకరం. ప్రతి సోమవారం రోజున శివుడిని ఈ విధంగా పూజిస్తే దరిద్రం పోయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సోమవారం రోజున ఉదయం లేవగానే తలస్నానం చేయాలి. ఆ తర్వాత శివుని గుడికి వెళ్లి పటం విభూతి లేదా శివుడి లింగం సమర్పించాలి. అనంతరం శివాష్టకం స్తోత్రం జపించాలి. 
 
స్తోత్రం జపించిన తర్వాత శివునికి పాలు మరియు నీళ్లను సమర్పించాలి. ఇంట్లో శివలింగం ఉన్న భక్తులు లింగానికి నీళ్లతో రోజూ అభిషేకం చేస్తే మంచి ఫలితo ఉంటుంది. ఇంట్లో శివలింగం లేకపోతే రాగి, వెండి గ్లాసుల్లో శివునికి పాలు, నీళ్లను సమర్పించాలి. అలా చేస్తే తక్కువ సమయంలో ఆర్థిక కష్టాలు తొలగిపోయి, సంపన్నులు అవుతారు. ఐశ్వర్యానికి కారకుడు శివుడు. 
 
మనం ఎంత సంపాదించినా శివుని అనుగ్రహం ఉంటే మాత్రమే ఆ డబ్బు మన చేతిలో నిలుస్తుంది. సోమవారం రోజున శివునికి నైవేద్యంగా దద్దోజనంను పెడితే అప్పుల బాధలు ఉండవు. పెరుగన్నంలో నేతితో పోపు పెట్టి దద్దోజనం తయారు చేయాలి. ప్రతి సోమవారం శివునికి దద్దోజనం నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగిపోయి త్వరలో ఐశ్వర్యవంతులు అవుతారు. సోమవారం కాకుండా మిగతా రోజుల్లో ఎండు ఖర్జూరం, ద్రాక్ష పండ్లు, కిస్మిస్, కొబ్బరికాయ నైవేద్యంగా పెడితే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: