ప్ర‌పంచం మొత్తం అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్ నుంచి దేశ ప్ర‌జ‌ల‌ను కాపాడాల‌నే ఉద్దేశ్యంతో సినిమాలు, షాపింగ్ మాల్స్ క‌ట్టేయ‌డ‌మే కాక ఏకంగా దేవుడి ద‌ర్శ‌నాల‌కు కూడా ఆటంకం క‌లిగించింది ఈ క‌రోనా వైర‌స్‌. ఒక మ‌నిషి నుంచి మ‌రో మ‌నిషికి గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధికి నివార‌ణ మందు దొర‌క‌పోవ‌డంతో ఈ విధ‌మైన క‌ఠిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌సి వ‌స్తుంది. అధిక జ‌న‌సాంధ్ర‌త ఉన్న ప్ర‌దేశాల‌కు వెళ్ళ‌కూడద‌ని ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కొర‌కు సూచిస్తోంది. అలాగే ప‌రిశుభ్ర‌త కూడా చాలా ముఖ్య‌మ‌ని ఈ జాగ్ర‌త్త‌ల‌న్నీ త‌ప్ప‌కుండా పాటిస్తే ఈ క‌రోనా మ‌హమ్మారిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని వైధ్యులు, శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 

 

ఈ సంద‌ర్భంగా సినిమాలు, షాపింగ్‌మాల్స్‌, మార్కెట్లు కాకుండా అధిక జ‌న‌సాంధ్ర‌త ఉండే గుడ్లు కూడా ఈ నెల 31 వ‌ర‌కు మూసివేయ‌నున్నారు. క‌రోనా వ్యాపిస్తున్న క్ర‌మంలో మార్చి31 వ‌ర‌కు అమ్మ‌వారి అన్ని సేవ‌లు నిలిపివేయ‌బ‌డుతున్నాయి. కరోనా నేపద్యంలో  అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేశామ‌ని పైలా సోమినాయుడు దుర్గగుడి చైర్మన్ తెలిపారు. అమ్మవారి బస్సులను , లిఫ్టులను ,కేశఖండనశాల నిలిపివేశామ‌న్నారు. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు అమ్మవారిని దర్శించు కోవడానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్ లిక్విడ్ అంద చేస్తున్నాము.

 

భక్తులు అందరిని చెక్ చేసిన తరువాతే దర్శనానికి అనుమతిస్తున్నామన్నారు. అమ్మ‌వారి ఆల‌య ఇ.ఓ. సురేష్‌బాబు దేశప్రజల ఆయురారోగ్యాలతో ఉండాలని హోమాలు జరిపిస్తున్నామ‌న్నారు. ఉగాది రోజు పంచాంగశ్రవణం, అమ్మవారి సేవలకు ఎవరికి అనుమతి లేదు. అమ్మవారికి జరిగే సేవలు నిరంతరం కొనసాగుతాయ‌న్నారు. భక్తులు ఎవరైనా ముందుగా సేవలను బుక్ చేసుకుని ఉంటే వారి  పేరున సేవలు నిర్వహిస్తాము, లేదా డబ్బు చెల్లిస్తాము. ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిసరాలను శుభ్రపరుస్తున్నాము అన్నారు. మహామండపం నుంచి మెట్ల మార్గము ద్వారా , ఘట్ రోడ్జు మార్గాలలో నే భక్తుల అనుమతి చిన్నపిల్లలు, వృద్దులు , గర్బిణీలు దర్శనానికి రాకపోవడం మంచిది. పొంగలి , కదబం, దద్దోజనం వంటి ప్రసాదాలు ప్యాకెట్లరూపంలో అందిస్తున్నామ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: