తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ఎప్పుడూ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతూ ఉండేది. నిత్యం పూజా కార్య‌క్ర‌మాల‌తో స్వామివారు క‌ళ‌క‌ళ‌లాడుతుండేవారు. అలాంటిది ఈ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆఖ‌రికి దేవాల‌యాలు కూడా మూసివేసే ప‌రిస్థితి నెల‌కొనింది. ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రావ‌డ‌మ‌నేది ఇదే మొద‌టిసారి మ‌రి ఇంత విప‌త్క‌ర‌మైన ప‌రిస్థితి నెల‌కొన‌డానికి చైనా నుంచి ఈ అంటు వ్యాధి ప్ర‌పంచ‌దేశాను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది.

 

ఇక ఈ వ్యాధిని అరిక‌ట్ట‌డానికి దేశ ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ కొర‌కు తిరుప‌తిలో జ‌రుగుతున్న‌ శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞం శుక్ర‌వారం 5వ రోజుకు చేరుకుంది. శుక్ర‌వారం నుండి ఈ జ‌ప‌య‌జ్ఞాన్ని శ్రీ‌వారి ఆల‌యంలో రంగ‌నాయ‌కుల మండ‌పంలో నిర్వ‌హిస్తున్నారు. ఈ వ్యాధి రోజు రోజుకి త‌గ్గు ముఖం పట్టి ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యాల‌తో సుఖంగా ఉండాల‌ని అక్క‌డి పూజారులు ఈ జ‌ప‌య‌జ్ఞాన్ని నిర్వ‌హిస్తున్నారు.

 

 ప్ర‌పంచ మాన‌వాళికి అశాంతిని, ఆనారోగ్యాన్ని దూరం చేసి స‌ర్వ‌తోముఖాభివృద్ధిని ప్ర‌సాదించాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తూ ఈ జ‌ప‌య‌జ్ఞాన్ని నిర్వ‌హిస్తున్నారు. దీనివ‌ల్ల సంపూర్ణ ఆరోగ్యం, పుష్టి, సుఖ‌శాంతులు చేకూరుతాయ‌ని వేద‌పండితులు చెబుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన 30 మంది వేద పండితులు దీక్ష‌గా కూర్చుని తిరుప‌తిలో ఎంతో నిష్ట‌తో నిబ‌ద్ధ‌త‌తో వేద‌మంత్ర జ‌ప‌య‌జ్ఞం నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ ఇత‌ర టిటిడి అధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: