హిందూ మతంలోని ప్రధాన దేవుళ్లలో శివుడు ఒకరు. సంస్కృతంలో శివ అనగా సౌమ్యం, శుభం అని అర్థాలు వస్తాయి. పురాణాల ప్రకారం శివునికి సోమవారం ఎంతో ప్రత్యేకమైన రోజు. లింగరూపంలోని శివుడిని పూజించిన వారు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని వేదాలు చెబుతున్నాయి. భక్తులను శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, కోరిన కోరికలను త్వరగా నెరవేరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. 
 
అయితే శివుడిని పూజించే సమయంలో కొన్ని పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోను చేయకూడదు. శివునికి మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రం సమర్పిస్తే మంచి జరుగుతుంది. అష్టమి, నవమి, పౌర్ణమి, మకర సంక్రాంతి, సోమవారం రోజులలో బిల్వ పత్రాలను కోయకూడదు. శివునికి ముక్క పోయిన ఆకులు పెట్టకూడదు. శివలింగానికి కేవలం గంధం మాత్రమే సమర్పించాలి. కుంకుమను ఎట్టి పరిస్థితుల్లోను ఉపయోగించకూడదు. కుంకుమ శ్రద్ధాభక్తులతో ధ్యానం చేసే శివుడిలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి కలిగిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
ఎట్టి పరిస్థితుల్లోను శివలింగంపై కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివునికి వెలగపoడు సమర్పిస్తే దీర్ఘాయుష్షు పొందవచ్చు. శివుడికి సంపంగి పూలను సమర్పించకూడదు. శివుని కంటే ముందు వినాయకుడిని పూజించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే చెప్పాడు. శివునికి తులసి ఆకులతో కూడా పూజ చేయకూడదు. శివుడిని పూజించే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రం చదివితే మంచి జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: