ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈరోజు సోమవారం,23.03.2020 ఉదయం 5 గంటల సమయానికి,తిరుమల: 19C°-31C°

 

• నిన్న లెక్కకు చిక్కనంత మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని మనోనేత్రం ద్వారా భాగ్యం లభించింది.

 

• ఈ సమయం శ్రీవారిని దర్శించుకోవటానికి లెక్కకందనంత మంది ఎదురుచూస్తున్నారు.

 

• స్వామివారి నిత్య సేవలు కైంకర్యాలు అన్నీ కూడా ఏకాంతం.

 

• నిన్న లెక్కకందనంత మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

 

• నిన్న స్వామివారికి హుండీ ఆదాయం లెక్క కందనంత.

 

ముఖ్య గమనిక:

• ఆపద మొక్కులవాడు, అనాధరక్షకుడు, కలియుగ దైవమైన స్వామిని ఇంట్లోనే ఆరాదించండి, స్వామి కృపకి పాత్రులు కండి.

 

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

 

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌

 

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి

మరింత సమాచారం తెలుసుకోండి: