తెలుగు వారి పెద్ద పండగ ఉగాది. ఈ  పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచుల కలయిక గల పచ్చడిని తీసుకుంటారు.అంతేకాదు ఈ ఉగాది పండుగ మన జీవితంలో ఎదరయ్యే మంచి, చెడు, కష్ట, సుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని సైతం మనకు ఇస్తుంది. అలాగే  ఈ కాలంలో   అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తుంటారు. అందుకనే  ఈ  పండుగ వెనుక ఒక వైజ్జానిక అంశం కూడా ఉంది. ఉగాది పచ్చడిని ఒక మహాఔషధమని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల  చాలా ఉపయోగాలు ఉన్నాయి.

 

 

ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. అంతే కాకుండా  వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన  అంటూ వ్యాధులను దగ్గరకు రానీయదు.  ఇప్పటికి కూడా అమ్మోరు  వస్తే ఎన్ని మందులు ఉన్నాగాని, వేప మండలు మాత్రం వేయకుండా ఉండరు. అలాగే  మామిడి  యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నది. ఇది కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది. మామిడిలో 'సి' విటమిన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది వ్యాధి నోరోధకత శక్తిని పెంపొందిస్తుంది. కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది.అలాగే రక్త హీనతని దూరం చేస్తుంది.

 

 

 

ఉగాది పండుగ రోజున చేసే తైల అభ్యంగన స్నానం (శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం)శరీరంలో ఉన్న టాక్సిన్స్ (విషపదార్థాలు)ను తొలగిస్తుంది. ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇళ్ళు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వల్లన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుందిఉగాది పండుగ సందర్భంగా మన ఇంటిని పూలతో అలంకరించుకుంటూ ఉంటాం. బంతి పూలు యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగినవి. మామిడి ఆకుల గురించి ఇందాకే చెప్పుకున్నాం. ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి. మొత్తంగా చూస్తే ఉగాది పచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి.ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని ‘నింబ కుసుమ భక్షణం‘, ‘అశోకకళికా ప్రాశనం‘ అని పేర్లతో వ్యవహరించేవారు.

 

 

 

రుతువులలో వచ్చే మార్పుల కారణంగా మనకు వచ్చే రోగాల నుండి రక్షణగా, ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇంతకుముందు ఉగాది పచ్చడిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, మిరపకాయలు, మామిడికాయలు ఉపయోగించేవారు. బెల్లంలోని తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకు విజయానికి సంకేతంగా భావిస్తారు. వేపలోని చేదు దు:ఖానికి, నష్టానికీ, ద్వేాషానికీ, అపజయానికి సంకేతంగా భావిస్తారు. ఈ రెండు కలిపి తీసుకుంటే కష్టసుఖాలు, ప్రేమానురాగాలు, విజయం చేకూరాలని చెప్పడమే.అలాగే  ఈ ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే సంతోషం(తీపి), దుఃఖం(చేదు), కోపం(కారం), భయం(ఉప్పు), విసుగు(చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం. అంతేకాకుండా ఈ ఆరు రుచులు ఆరు రకాలైన లాభాలను కలుగచేస్తున్నవి.

మరింత సమాచారం తెలుసుకోండి: