శ్రీ వికారి నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారు జరుపుకునే పండుగ ఉగాది. ఇది చైత్ర మాస శుద్ధ పాడ్యమిన వస్తుంది. ఉగాది నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీంతో ఇది తెలుగువారి పండుగ అయ్యింది. కొత్త సంవత్సరాదైన ఉగాది నుండే వసంతకాలం మొదలవుతుంది. వాతావరణం ఆ రోజు నుండి ప్రత్యేక అందాలను సంతరించుకొంటుంది. ఉగాది పండుగ అంటే ప్రతి ఒక్కరి మదిలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇక ఉగాది వస్తోందంటే చాలు వేప పచ్చడీ, పంచాంగ శ్రవణమే గుర్తుకుస్తాయి. 

 

పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచుల కలయిక గల పచ్చడిని తీసుకుంటారు. అలాగే ఉగాది పండ‌గ‌కు ఉగాది ప‌చ్చ‌డి ఎంత ముఖ్య‌మో.. పంచాంగ శ్ర‌వ‌ణం కూడా అంతే ముఖ్యం. ఉగాది రోజంతా ఆలయాల్లో పంచాంగ శ్రవణం ఉంటుంది. ఆ  సంవత్సరికి గాను తమ పేరున ఆదాయ లాభాలు, ఖర్చులూ, తమ కుటుంబ స్థితిగతుల మీద ఒక అవగాహన తెచ్చుకుంటారు. ఇక పంచాంగం అంటే ఐదు అంగాలు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగము, కరణము అనే ఐదు అంగాలతో కూడుకున్నది కాబట్టి అది పంచాంగం అని అంటారు. 

 

మనకి మొత్తం 15తిథులు,7 వారాలు,27 నక్షత్రాలూ,27 కరణములు,11 యోగములు వున్నాయి. ప్రతి మనషి యొక్క జన్మ నక్షత్రాన్నిబట్టి అతనికి ఆ సంవత్సరం ఎలా వుందో, ఏ కార్యక్రమాలు చెయ్యవచ్చో పంచాంగం తెలియచేస్తుంది. అలాగే ఈ పంచాంగ శ్రవణం వింటే శుభం కలుగుతుంది. అందుకే ఈ రోజు యుక్త వయస్కులు, నడివయస్కులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు ఎంతో శ్రద్ధగా వారి వారి స్థాయిల్లో పంచాంగ శ్రవణం చేయటం పరిపాటి.  

మరింత సమాచారం తెలుసుకోండి: