ఉగాది హిందువులు జరుపుకునే ప్రధమ పండుగ. ఈ పండుగ నాడు అంతా ఇళ్ళని శుభ్రం చేసుకుని భక్తితో పూజ చేసుకుంటారు.  అలానే అన్నింటి కంటే ముఖ్యం అయినది ఉగాది పచ్చడి. అయితే ఈ ఉగాది పచ్చడిని అనేక ప్రాంతాల వాళ్ళు అనేక విధాలుగా చేసుకుంటారు, షడ్రుచులు ప్రధానం. మధురం , ఆమ్లం, లవణం, కటు , తిక్త , కషాయం.

 

IHG

 

 

ఇలా ఈ మన ఉగాది పచ్చడి లో ఈ ఆరు రుచులు ఉంటాయి. మధురం అంటే తీపి, ఆమ్లం అంటే పులుపు, లవణం అంటే ఉప్పు, కటు అంటే కారం, తిక్త  అంటే చేదు, కషాయం అంటే వగరు. ఇలా మొత్తం ఈ ఆరు రుచులతో కలిగి ఉంటుంది మన ఉగాది పచ్చడి.

 

ఈ ఉగాది రోజు కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి మొదట మాసం అయిన చైత్ర మాసంలో ఉగాది వస్తుంది. ఈ వసంతంతో చెట్లు చక్కగా ఆకులతో చిగుర్తిస్తాయి, కోకిల రాగాలు కమ్మగా వినిపిస్తాయి, రంగు రంగుల పువ్వులతో వాటి  పరిమళాల తో ఎంతో అందంగా ఉంటుంది ప్రకృతి. ఈ సంవత్సరం వచ్చే తెలుగు సంవత్సరం పేరు శార్వరి నామ సంవత్సరం.

 

IHG

 

 

శిశిర ఋతువులో ఆకులు రాలి పోయిన తర్వాత వసంతం వస్తుంది. అందుకే ఈ ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. మొదటి పండుగ కనుక దీనిని షడ్రుచులతో ఆహ్వానం చేస్తారు. మరెప్పుడు చేసుకొని ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజునే చేసుకుని కష్టమైనా, సుఖమైనా ఆనందంగా స్వీకరించాలని అంటారు. ఇలా ఈ పండుగని ఆనందంగా జరుపుకుంటారు. కొత్త పనులు ప్రారంభం చేసి విజయం అందుకోవాలని తలుస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: