అనేక ప్రాంతాల ప్రజలు ఈ ఉగాదిని జరుపుకుంటారు. కానీ ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. అయితే  ఈ ఉగాది పండుగని మరాఠీ ప్రజలు గుడి పడ్వాగా చేసుకుంటారు. ఉగాదిని తమిళులు పుత్తాండు అన్న పేరుతో పిలుస్తారు. అలానే మలయాళీలు కూడా ఈ పండుగని చేసుకుంటారు. వారు దీనిని విఘా అని అంటారు.

 

IHG

 

 

వీరు మాత్రమే కాక సిక్కులు కూడా ఉగాది పండుగ చేసుకుంటారు. వారు వైశాఖి అని పిలుస్తారు.  బెంగాలీ వాళ్ళు పొయ్ లా బైశాఖ్ అని ఉగాదిని జరుపుకుంటారు. ఇలా వివిధ ప్రాంతాల వారు ఈ పండుగని జరుపుకుంటారు. అయితే ఆంధ్ర లో మాత్రం ఉగాది పచ్చడిని మన గోదావరి జిల్లాలో మాత్రమే తినాలి. అక్కడ పచ్చడి చాల రుచిగా ఉంటుంది.

 

 

గోదావరి జిల్లాలోనే  ఉగాది పచ్చడిని తినాలి. అక్కడ ఎంతో ఫేమస్. ఆ పచ్చడి వాళ్ళు చాల రుచిగా తయారు చేస్తారు. అయితే ఒకొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు ఉగాది పచ్చడిని. అయితే ఈ పచ్చడి లో  చెరకు అరటి పళ్ళు , మామిడి కాయలు ,చింతపండు,వేప పువ్వు , జామ కాయలు, బెల్లం ఇలా వివిధ రకాల వాళ్ళ మంచి రుచిని ఇస్తాయి ఈ పదార్దాలు. కాబట్టి వీటిని ఇందులో  ఉపయోగిస్తారు. 

 

IHG

 

చింతపండు, బెల్లం, వేప పువ్వు, మామిడి కాయ, ఉప్పు, కారం, బెల్లం ఈ ఆరు పదార్ధాలు మధురం, ఆమ్లం, లవణం, కటు, తిక్త, కషాయం రుచులని ఇస్తాయి. అయితే గోదావరి జిల్లా వాళ్ళు వీటితో పాటు కొబ్బరి పొడి, శనగట్నాల పొడి కూడా పచ్చడిలో వేస్తారు. దీని వల్ల పచ్చడి రుచి మరెంత గానో వస్తుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: