అసలు ఉగాది పండగ అంటే చాలా మందికి ఒక్క ఉగాది పచ్చడి తినటమే అని తెలుసుగాని దాని ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు.. ఈతరం వాళ్ళకి అసలు తెలియదు. మనమందరం ఈ పండగ ఎందుకు జరుపుకుంటాము, ఉగాది పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం.

 

చైత్రమాసంలోని  మొదటి రోజైన చైత్ర శుద్ధ  పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.కొత్త సంవత్సరాదైన ఉగాది నుండే వసంతకాలం మొదలవుతుంది. వాతావరణం ఈ రోజు నుండి ప్రత్యేక అందాలను సంతరించుకొంటుంది. ఈ సమయంలో వృక్షాలు కొత్త ఆకులు, పూలతో చూపరులను ఆహ్లాదపరుస్తాయి.ఎక్కడ చుసిన పచ్చదనం కనిపిస్తుంది. ఉగాది రోజున కొత్త పనులు, నిర్ణయాలు ప్రారంభించే సమయమని తెలుగు ప్రజలు నమ్ముతారు.  అంతే కాకుండా ఈరోజు కొత్త వస్తువులను కూడా కొని ప్రారంభించటం ఆనవాయితీ.

 

బ్రహ్మ విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజునే ఉగాది పండగ అని పురాణాల ప్రవచనం. ఈ ఉగాది పండగ చారిత్రిక వివరాలను కూడా కలిగి ఉంది. ఉగాది పండగ శాలివాహనుల కాలం నుండి ఆచరణలో ఉన్నాదని చరిత్రకారుల మాట. అప్పటి శాలివాహనుల రాజు "గౌతమీపుత్ర శాతకర్ణి"గా పేర్గాంచిన రాజా శాలివాహన ఉగాది పండగకు శ్రీకారం చుట్టారు.తెలుగు సంవత్సరాలు 60. ప్రభవతో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ తిరిగి ప్రభవతో ఆరంభమవుతుంది. ఈ పేర్ల వెనుక భిన్న వాదనలు ఉన్నాయి.

 

ఓ పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడి 16100 మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి పిల్లల పేర్లు వీటికి పెట్టారనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దక్షుడు కుమార్తెల పేర్లుకూడా ఇవేనని అంటారు.కాలమానంలోని అంశాలన్నింటిని పూర్తిగా ఖగోల శాస్త్రరీత్యా పురాతన భారతీయులు నిర్ణయించారు.

 

కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, కార్తె మాసం, రుతువు, అయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నింటినీ ఖగోళ శాస్త్ర ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఖగోళపరమైన కాలమానాన్ని పురాణకాలం నుంచి ఆచరించడం భారతీయుల ఘనత. ఇది మన భారతజాతి కాలమాన పరిజ్ఞానానికి ఉన్న అవగాహనను తెలిజేస్తుంది. అంతేకాదు మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉంది ఉగాది.

మరింత సమాచారం తెలుసుకోండి: