వసంతకాలం మొదలు, కొత్త సంవత్సరాదైన ఉగాది నుండే ఆరంభం అవుతుంది. వాతావరణం ఈ రోజు నుండి ప్రత్యేక అందాలను పులుముకుంటుంది. ఈ పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరంటే మనం నమ్మి తీరాలి. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ వున్నా, దీన్ని ఖచ్చితంగా జరుపుకుంటారు. ఉగాది ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలవబడుతుంది. తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు దీన్ని సెలెబ్రేట్ చేసుకుంటారు. తెలుగువారు "ఉగాది" అని, కన్నడిగులు "యుగాది" అని, కేరళ అండ్ మరాఠీలు "గుడి పాడ్వా" గా ఈ పండగని జరుపుకుంటారు. 

 

ప్రవాస భారతీయులు... తాము వుండే దేశాల్లో ఉగాదిని ఎంతో నిబద్ధతతో జరుపుకొని, విదేశీయుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఉగాది రోజున కొత్త పనులు, కొత్త నిర్ణయాలు ప్రారంభించే సమయమని తెలుగు ప్రజలు నమ్మకం, అలాగే... ఈరోజు కొత్త వస్తువులను కూడా కొని ప్రారంభించటం, తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ 2020 వ సంవత్సరం, శార్వరి నామ సంవత్సర ఉగాదిగా మార్చ్-25వ తారీఖున జరుపుకోబడుతుంది.

 

ప్రతి యుగానికి 60 సంవత్సరాల చక్రం అని మన భారతీయ శాస్త్రాలు చెబుతున్నాయి.. ప్రతి ఉగాదికి జ్యోతిష శాస్త్ర ప్రభావాల ఆధారంగా పంచాంగంలో ఒక ప్రత్యేక పేరు ఉంది. అలాగే, ఈ ఉగాది నామ సంవత్సరం ఆ సంవత్సరం యొక్క ప్రత్యేకతని చాటుతుంది. ఈ రకంగా, మనకు 60 సంవత్సరాల పేర్లు ఉన్నవి. ఆ ఉగాది పేర్లు దిగువన ఇవ్వబడ్డాయి. అయితే పైన చెప్పిన విధంగా ఈ 2020 ఉగాది... శార్వరి నామ సంవత్సరంగా పిలువబడుతుంది.

 

1. ప్రభవ 2. విభవ 3. శుక్ల 4. ప్రమోద్యూత 5. ప్రజోత్పత్తి 6. ఆంగీరస 7. శ్రీముఖ 8. భావ 9. యువ 10. ధాత 11. ఈశ్వర 12. బహుధాన్య 13. ప్రమాధి 14. విక్రమ 15. వృష 16. చిత్రభాను 17. స్వభాను 18. తారణ 19. పార్థివ 20. వ్యయ 21. సర్వజిత 22. సర్వధారి 23. విరోధి 24. వికృతి 25. ఖర 26. నందన 27. విజయ 28. జయ 29. మన్మధ 30. దుర్ముఖి 31. హేవళంబి 32. విళంబి 33. వికారి 34. శార్వరి 35. ప్లవ 36. శుభకృత 37. శోభకృత 38. క్రోధి 39. విశ్వావసు 40. పరాభవ 41. ప్లవంగ 42. కీలక 43. సౌమ్య 44. సాధారణ 45. విరోధికృత 46. పరిధావి 47. ప్రమాదీచ 48. ఆనంద 49. రాక్షస 50. నల 51. పింగళ 52. కాళయుక్తి 53. సిద్ధార్థ 54. రౌద్రి 55. దుర్మతి 56. దుందుభి 57. రుధిరోద్గారి 58. రక్తాక్షి 59. క్రోధన 60. అక్షయ

మరింత సమాచారం తెలుసుకోండి: