తరతరాల నుండి వస్తోంది ఈ సంప్రదాయం. ఆనాటి  కాలం నుంచి వస్తున్న పండుగల్లో ముఖ్యమైన పండుగ మన ఉగాది పండుగ . ఉగాది పండుగ నాడు తెలుగు వారు మాత్రమే కాక మరి కొంత మంది కూడా ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా మార్చి నెలలో లేదా కొన్ని సార్లు ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంది. సంక్రాంతి మూడు రోజులు జరుపుకుంటారు అలానే కొన్ని పండుగలు ఒకటి కంటే ఎక్కువ రోజులు కూడా చేసుకుంటారు.

 

IHG

 

 

కానీ ఉగాది  అనేది ఒక్క రోజు పండుగ మాత్రమే. తెలుగు ప్రజలు మాత్రమే కాక  ఈ  పండుగని కన్నడ ,కొంకణి , బాలి ప్రజలు ఈ నూతన సంవత్సర పండుగని జరుపుకుంటారు. ఉగాది అనే పదం ఉగస్య అనే పదం నుండి వచ్చింది. ఉగ అంటే నక్షత్ర గమనం - జన్మ , ఆయుష్షు అని కూడా దానికి అర్ధం . ఆది అంటే మొదలు లేదా  ప్రారంభం . కనుక ఉగాది అంటే ప్రపంచం యొక్క  జన్మ ఆయుష్షులకు మొదటి రోజు.

 

భారత దేశ సాంప్రదాయము ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అంటే ఈ ఉగాది రోజునే సృష్టి జరిగింది అని పురాణాల నుండి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజే సమస్తం జన్మించింది అని అంటారు.ఈ ఉగాది పండుగని మరాఠీ ప్రజలు గుడి పడ్వాగా చేసుకుంటారు.

 

IHG

 

 

అలానే తమిళులు పుత్తాండు అని ఈ పండుగని జరుపుకుంటారు. మలయాళీలు విఘా అని అంటారు. అంతే కాక సిక్కులు వైశాఖి, బెంగాలీ పొయ్ లా బైశాఖ్ అని ఉగాదిని జరుపుకుంటారు. కేవలం తెలుగు వారు మాత్రమే కాక వీళ్ళు కూడా ఈ పండుగని చేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: