ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చింది. అనగా సంవత్సరంలో మొదటి రోజు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది. ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి నాడి బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెపుతున్నాయి. మ‌రొక‌ కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను దొంగిలించాడు. 

 

అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం వెళ్లి సోమకారుణ్ణి వాదించి వేదాలను తీసుకొని వచ్చి, బ్రహ్మ దేవుడికి అప్పగించాడట. ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పురాణాలు చెపుతున్నాయి. ఇలా ఉగాది ఎన్నో క‌థ‌లు పుర‌ణాల్లో ఉన్నాయి. ఈ పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచుల కలయిక గల పచ్చడిని తీసుకుంటారు. ఇదిలా ఉంటే.. ఉగాది రోజులు పొర‌పాటున కూడా కొన్ని త‌ప్పులు చేయ‌కూడ‌దు. మ‌రి అవేంటో చూడండి.

 

అలాగే ఉగాది పండుగ రోజున చేయకూడని పనులు కూడా చాలానే ఉన్నాయి.అందులో ముఖ్యంగా ఉగాది రోజున మాంసం తినకూడదు. ఉగాది రోజున ప్రశాంతంగా ఉంటూ , ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా పండుగని సంతోషం గా జరుపుకోవాలి. అలాగే ఉగాది నాడు తప్పనిసరిగా నూతన వస్త్రాలు ధరించాలి. పాత వస్త్రాలు ధరించకూడదు. మద్యం సేవించ కూడదు. మ‌రియు దక్షణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: