మ‌న తెలుగు సంవ‌త్స‌రం ప్రారంభ రోజు అయిన ఉగాది పండ‌గ‌కు కొన్ని శ‌తాబ్దాల చ‌రిత్ర ఉంది. ప్ర‌పంచం అంతా ఇప్పుడు జ‌న‌వ‌రి 1వ తేదీని కొత్త సంవ‌త్స‌రంగా జ‌రుపు కుంటున్నాం. అయితే బ్రిటీష‌ర్లు వ‌చ్చాక ఈ ఇంగ్లీష్ సంవ‌త్స‌రాలు వ‌చ్చాయి. మ‌రి అంత‌కు కొన్ని సంవ‌త్స‌రాలు ఇంకా చెప్పాలంటే వంద‌లు.. వేల ఏళ్ల నుంచి తెలుగు సంవ‌త్స‌రాలే మ‌న పూర్వీకులు పాటిస్తూ వ‌చ్చారు. మ‌న తెలుగు సంవ‌త్స‌రాలు మొత్తం 60 ఉంటాయి. ఇవి ఒక‌సారి పూర్తి అయ్యాక మ‌ళ్లీ ప్ర‌భ‌వ నుంచి ప్రారంభ మ‌వుతాయి. మ‌న పూర్వీకులు ఒక కొత్త సంవ‌త్స‌రం వ‌స్తుందంటే వాళ్ల చిన్న‌ప్పుడు ఆ సంవ‌త్స‌రం గురించి ఐడియా ఉంటే అప్ప‌ట్లో ఆ సంవ‌త్స‌రంలో ఏం జ‌రిగాయ‌న్న‌ది గుర్తు చేస్తూ ఉంటారు.



అస‌లు ఉగాది ఎందుకు ?  వ‌చ్చింది ? ఉగాది ప్రాముఖ్యం ఏంట‌న్న‌ది ప‌రిశీలిస్తే చ‌రిత్ర‌లో ఉగాదికి చాలా ప్రాముఖ్య‌త ఉంది. ఉగాది ప్రాముఖ్యత అంటే చైత్ర శుద్ద పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టి నిర్మాణం ప్రారంభించిన రోజు అని నమ్ముతారు. ఉగాది ని యుగాది అనికూడా వ్యవహరిస్తారు. అంటే దీనిని యుగ‌ము యొక్క ఆదిగా పిలుస్తారు. యుగ‌ము అంటే ద్వ‌య‌ము అని కూడా పిలుస్తారు. అంటే జంట అని కూడా అర్థం వ‌స్తుంది. రెండు ఆయ‌న‌ముల కాల‌ము అంటే ఇది ఉత్త‌రాయ‌నం.. ద‌క్షిణాయ‌న‌ముల స‌మ్మేళ‌నం.



ఇక దీని గురించి మ‌రో క‌థ క‌డా పురాణాల్లో ఉంది. విష్ణు మూర్తి మత్చ్యయావతారములో సోమకుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజు. అలాగే శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు అని.. ఉగాది అంటే ఉగా అనగా నక్షత్ర గమనం అని.. సృష్టి ఆరంభమైన దినమే ఉగాది అన్న‌ది చ‌రిత్ర‌లో ఉంది. ఈ రోజున ప్రజలు తమ శ్రమ ఫలితాన్ని కళ్ళెదుట చూస్తూ పొంగిపోతారు. ఒక్క తెలుగు సంప్రదాయకంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాన్డుగా, మళయాళం లో విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖి గాను, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్ గాను ఉగాదిని జరుపుకుంటారు. ఈ రోజున వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్ర దర్శనం , ఆర్య పూజనం, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు.



ఇక ఆ రోజు రైతులు అంద‌రూ ఉద‌యం మోకు వేసి .. సాయంత్రం పొలానికి వెళ్లి ఏరువాక సాకుతారు. ఆ రోజు రైతుల ఎవ్వ‌రికి ఏమీ ఇవ్వ‌రు.. ఎవ్వ‌రి నుంచి ఏమీ తీసుకోరు. ఆ రోజు అలా చేస్తే యేడాదంతా బాగుండి.. పంట‌లు బాగా పండ‌తాయ‌న్న న‌మ్మ‌కంతో ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: