దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో శబరిమల శ్రీఅయ్యప్ప ఆలయం ఒకటి. శబరిమలైవాసుడు.. మణికంఠుడి దర్శనం కోసం మాల ధరించిన భక్తులు పయనమవుతున్నారు. అయ్యప్పని దర్శించేందుకు కఠినమైన మండల దీక్ష చేపట్టి.. విల్లాదివీరుని స్మరించుకుంటూ  కేరళకు బయలుదేర‌తారు. అయితే దీక్షను నియంత్రణాత్మక, ఆధ్యాత్మిక సోపానంగా భావిస్తూ పలువురు దీక్ష బూనతారు. క్రమపద్ధతిలో 41 రోజులు పాటు దీక్ష కొనసాగిస్తుంటారు. వీటి వల్ల పుణ్యం, ముక్తిదాయకమైన భావన కలగడమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుంది. 

 

దీక్షాకాలంలో స్వాములు పాదరక్షలు లేకుండా శబరిమలై చేరాలి. పెద్దపాదం లో రాళ్లు రప్పలు, కొండప్రాంతంలో పాద రక్షలు లేకుండా నడవడం కష్టం. అందుకు సిద్ధం అయ్యేందుకే 41 రోజులు స్వాము లు పాదరక్షలు లేకుండా ఉంటారు. ఇక పాదాలు నేరుగా భూమిని తాకుతుండటంతో భూస్థితికి తగినరీతిలో రక్త ప్ర సరణ, హృదయ స్పందనలుంటాయి. అయ్యప్ప భక్తులు నల్లటి దుస్తులు దరిస్తారు. ఈ దుస్తులు ధరించిన వారిపై శని దేవుడి చూపు ఉండదని భక్తుల విశ్వాసం. 

 

తాత్విక కోణంలో చూస్తే నలుపు ఆకర్షణలకు దూరంగా ఉండి అన్ని ఇహసుఖాలను త్యజించమని చెబుతుంది. ఈ దుస్తులు తగిన ఊష్ణోగ్రతను శరీరానికి అందించి సమతుల్యతకు దోహదం చేస్తుంది. దీక్షాకాలంలో స్వాములు ఉదయం, సాయంత్రం చన్నీళ్లతో తల స్నానం చేస్తారు. మెదడు ఆలోచనలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. అంటే పని చేస్తుందన్న మాట. ప‌ని ఉన్న ప్రతి చోట ఘర్షణ  ఉంటుందని సైన్స్‌ చెబుతోంది. దాని వల్ల అలసటతో పాటు ఉష్ణం ఏర్పడుతుంది. అధిక ఉష్ణం ఆరోగ్యానికి నష్టదాయకం. దీనికి విరుగుడుగా చన్నీటి స్నానం ఉపకరిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: