ఉగాది అనగానే మన తెలుగు రాష్ట్రాలలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. ప్రజలు అందరూ కూడా ఉగాదిని మతాలకు కులాలకు అతీతంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఉగాది ఇప్పుడు కరోనా నేపధ్యంలో బోసి పోతుంది. గ్రామాల్లో ఏ ఇల్లు చూసినా సందడి లేకుండానే ఉంది. కనీసం గ్రామాల్లో ఉన్న గుడికి కూడా ఎవరిని రానివ్వడం లేదు. అన్ని గ్రామాలు కూడా ఇప్పుడు పండగకు దూరంగా ఉన్నారు. 

 

ప్రస్తుతం కరోనా విస్తరిస్తుంది. ఏ విధంగా వస్తుందో అర్ధం కావడం లేదు. అన్ని విధాలుగా కూడా కరోనా వస్తున్న నేపధ్యంలో గ్రామాల్లోకి ఎవరిని రానీయకుండా కఠిన చర్యలు అమలు చేస్తూ పక్కింటి వారికి కూడా వెళ్ళడం లేదు. చాలా వరకు గ్రామాల్లో మామిడి తోరణాలు కూడా కట్టడం లేదు. మార్కెట్ లు కూడా ఇప్పుడు ప్రజలు లేక నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు ఎక్కడ కొడతారో అనే భయం తో ఎవరూ బయటకు రావడం లేదు. 

 

లాక్ డౌన్ ని గ్రామాల్లో కాస్త ఎక్కువగానే పాటిస్తున్నారు జనాలు అందరూ కూడా. మన దేశంలో ఇప్పుడు కరోనా వేగంగా విస్తరిస్తుంది. కేసులు కూడా క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండి స్నానం చేసి ఇళ్ళల్లోనే ఉంటున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉగాదిని నిర్వహించవద్దు అని కోరుతున్న నేపధ్యంలో అందరూ అప్రమత్తంగానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: