యుగానికి ఆది ఉగాది. శ్రీ వికారి నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారు జరుపుకునే పండుగ ఉగాది. మొదటి రుతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి పక్షం శుక్లపక్షం.. ఇవన్నీ ఒకటిగా కలిసి వచ్చే పండుగ ఉగాది. అయితే  ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజు చైత్ర శుధ్ధ పాఢ్యమి కావడంతో ఏటా ఆ పర్వదినాన మనం ఉగాది పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

 

చిరు మామిళ్ల వగరు, వేప పువ్వుల చేదు, కొత్త బెల్లం తీపి, చింతపండు పులువు, మిరపకాయల ఘాటు, ఉప్పు ఇలాంటి షడ్రుచుల సంగమమే ఉగాది పచ్చడి. జీవితంలో ఎదురయ్యే సుఖ దుఖాలు, ఆశ్చర్యానందాల కి ప్రతి రూపంగా ఆరు రుచుల సమ్మేళనంతో చేసే ఈ పచ్చడిని ఈ రోజు ప్రతి ఒక్కరు తప్పకుండా సేవించాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేడు ఉగాది పర్వదినం కాగా, అధికార పంచాంగ శ్రవణాలు నిరాడంబరంగా సాగాయి. 

 

శ్రీ శార్వరీ నామ సంవత్సరం శుభ ఫలితాలను అందిస్తుందని, వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని పండితులు వెల్లడించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకూ కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటాయని అంచనా వేశారు. విద్యారంగంలో సంస్కరణలు జరుగుతాయని, కుంభకోణాలు జరగవచ్చని, రియల్ ఎస్టేట్ రంగం అంతంతమాత్రంగానే ఉంటుందని అంచనా వేశారు. ఇక 12 రాశుల వారికీ ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్య, అవమానాలను చూసిన‌ట్లైతే..

 

మేష రాశి        - ఆదాయం - 5, వ్యయం - 5; రాజ్యపూజ్యత - 3, అవమానం - 1
వృషభ రాశి    - ఆదాయం - 14, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 6, అవమానం - 1
మిధున రాశి   - ఆదాయం - 2, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 2, అవమానం - 4
కర్కాటక రాశి - ఆదాయం - 11, వ్యయం - 8; రాజ్యపూజ్యత - 5, అవమానం - 4

 

సింహ రాశి     - ఆదాయం - 14, వ్యయం - 2; రాజ్యపూజ్యత - 1, అవమానం - 7
కన్యా రాశి       - ఆదాయం - 2, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 4, అవమానం - 0
తులా రాశి      - ఆదాయం - 14, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 7, అవమానం - 7
వృశ్చిక రాశి   - ఆదాయం - 5, వ్యయం - 5; రాజ్యపూజ్యత - 3, అవమానం - 3

 

ధనస్సు రాశి  - ఆదాయం - 8, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 6, అవమానం - 3
మకర రాశి      - ఆదాయం - 11, వ్యయం - 5; రాజ్యపూజ్యత - 2, అవమానం - 6
కుంభ రాశి     - ఆదాయం - 11, వ్యయం - 5; రాజ్యపూజ్యత - 5, అవమానం - 6
మీన రాశి        - ఆదాయం - 8, వ్యయం - 11; రాజ్యపూజ్యత - 1, అవమానం - 2

మరింత సమాచారం తెలుసుకోండి: