కరోనా ప్రభావం దేశంలోని అన్ని రంగాలనూ తాకుతోంది. ఇండియాలో మెజారిటీ హిందువుల మనోభావాలతో ముడిపడిన కీలకమైన అంశం అయోధ్య. ఇటీవలే అయోధ్య రామమందర నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. రామ మంది నిర్మాణానికి ఓ ట్రస్టు కూడా ఏర్పాటైంది కదా.

 

 

ఇప్పుడు రాముని విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగంణంలోకి తరలించిన కీలక ఘట్టం చాలా సాదాసీదాగా జరిగిపోయింది. కరోనా ఎఫెక్టు లేకపోతే మీడియా అంతా దీన్నే ఫోకస్ చేసే అవకాశం ఉండేది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చైతన్య రాత్రి పర్వదినాన అయోధ్యలో ఈ క్రతువు నిర్వహించారు. ఆదిత్యనాథ్‌ స్వయంగా తన చేతుల మీదుగా రామ జన్మభూమి ప్రాంగణంలోని మాసస భవన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణంలోకి రాముని విగ్రహాన్ని తరలించారు.

 

 

రామమందిరం నిర్మాణం చేపట్టడం కోసం రాముని విగ్రహాన్ని తాత్కాలిక ఆలయంలోకి తరలించారు. 9.5 కిలోల సింహాసనంపై రాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. శ్రీ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో సభ్యునిగా ఉన్న రాజ అయోధ్య విమలేంద్ర మోహన్‌ మిశ్రా ఈ సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చారు. అదే కరోనా లేకుండా ఉండి ఉంటే.. దేశమంతా ఆ ఘట్టాన్ని ఆసక్తిగా తిలకించి ఉండేది. ఇలా అన్ని రంగాలనూ కరోనా ప్రభావితం చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: