శ్రీరామనవమి పండగ అంటే హిందువులు జరుపుకునే  అతి ముఖ్యమైన పండగల్లో ఒకటి. రావణ సంహారం జరిపిన శ్రీ రాముడిని అందరు దేవుడిలా కొలుస్తు గుండెల్లో పెట్టుకుంటారు. మంచి లక్షణాలు ఉన్న ఏక పత్నీవ్రతుడు మన రాముడు. రాముడుకి అండగా తమ్ముళ్లు, రాముడిని అభిమానించే  వానరుడు మన ఆంజనేయడు, భర్త అడుగు జాడల్లో నడిచే పత్ని మన సీతమ్మ.. వింటుంటే ఎంత ముచ్చటగా ఉందొ కదండీ మన రాములవారి కధ.

 

శ్రీ రామనవమి రోజున సీత రాములా కళ్యాణం అత్యంత వైభోగంగా జరుపుతారు. అన్ని రాములవారి గుళ్ళల్లో ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భద్రాచలం సీతారాముల కళ్యాణం చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. పచ్చటి పందిరిలో, పెళ్ళికి వచ్చిన భక్తులతో పందిరి కళకళలాడిపోతుంది. మన నూతన వధూవరులు సీత రాములు చూడచక్కని జంట ...! పచ్చని పందిరిలో ముత్యాల తలంబ్రాలతో ఒక్కటి అవుతారు. వివాహం జరిగాక చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు.

 

 

చైత్ర నవరాత్రి అని మహారాష్ట్రలో పిలుస్తారు అలాగే వసంతోత్సవం అని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో పిలుస్తారు. అయితే  తొమ్మిది రోజులు పాటు ఈ  ఉత్సవాలను జరిపిస్తారు. ఉత్సవ మూర్తుల విగ్రహాల ఊరేగింపులో చాలా మంది భక్తులు పాల్గొంటారు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా, ఉత్సహంగా ఊరేగింపు జరుపుకుంటారు.

 

 

బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం శ్రీరాములవారికి ఎంతో ప్రీతికరం. అలాగే చలిమిడి, వడపప్పు కూడా ప్రసాదం కింద దేవుడికి నైవేద్యం పెడతారు. ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం తీసుకుంటారు.  గుడిని రంగురంగుల విద్యుత్ కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా రాములవారి ఉత్సవంలో పాల్గొంటారు అందరు. వసంతోత్సవం ముగిసాక అన్నసమారాధన చేస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: