శ్రీరామనవమి.. ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామనవమి. నవమి నాడు శ్రీరాముడు జన్మించిన రోజు కావడం వల్ల నవమి రోజును పండుగలా జరుపుకుంటారు. అయితే శ్రీరాముడు జన్మించిన రోజు మాత్రమే కాదు  శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా నవమి నాడే.. అలాగే పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి నాడే జరిగింది అని ప్రజల విశ్వాసం. 

 

ఇంకా ఈ శ్రీరామనవమి నాడు వడపప్పు ప్రసాదం, పానకం ప్రత్యేకంగా చేస్తారు. శ్రీరాముడుకు పానకం ఎంతో ప్రీతిపాత్రమైంది.. అందుకే వడపప్పు, పానకం ఎంతో ప్రత్యేకంగా చేస్తారు. అయితే ఇలా పానకం, వడపప్పు చేయడానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుందని.. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుందని, దేహకాంతికి, జ్ఞానానికి ఈ వడపప్పు ప్రతీక. ఇంకా ఎండల్లో వడ కొట్టకుండా వేడి నుండి రక్షిస్తుంది అని పూర్వికులు చెప్తుంటారు. 

 

ఇంకా పానకం కూడా ఎంతో మంచిది అని.. గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని ఆయర్వేద నిపుణులు చెప్తారు. అంతేకాదు ఈ పానకంతో ఆరోగ్యం బాగుంటుందని, ఆయుష్ పెరుగుతుంది అని పూర్వికులు చెప్పేవారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: