బాలాజీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి లోకంలో ఎంత మంది దేవుళ్ళు ఉన్నా ఈయ‌న‌కు మాత్రం భ‌క్తులు బాగా ఎక్కువ‌. అందుకే ఈయ‌న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పుణ్య‌క్షేత్రాల్లో చెప్పుకోద‌గ్గ పుణ్య‌క్షేత్రంగా నిలిచింది. ఈయ‌న త‌న భ‌క్తుల‌ను అనుగ్రహించడం కోసం అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. కేవ‌లం తిరుప‌తి మాత్ర‌మే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరుకు ద‌గ్గ‌ర‌లో ద్వార‌కా తిరుమ‌ల అని కూడా ఒకటి ఉంది. తిరుమ‌ల‌లోఉండేదాన్ని పెద్ద తిరుప‌తి అని ఏలూరుకు ద‌గ్గ‌ర‌లో ఉండేదాన్ని చిన్న తిరుప‌తి అని అంటారు. పెద్ద తిరుప‌తి వ‌ర‌కు వెళ్ళ‌లేని వాళ్ళు వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ఇక్క‌డ చిన్న తిరుప‌తిలో ద‌ర్శించుకుంటారు. అలాగే హైదరాబాద్‌లో కూడా ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది. ఈయ‌న‌కు వీసాల స్వామి అనే పేరు కూడా ఉంది. ఇక్క‌డ ఎవ‌రైనా స‌రే 11 ప్ర‌ద‌క్షిణాలు చేసి ఏద‌న్నా మొక్క‌కుని ఆ కోరిక తీర‌గానే 108 ప్ర‌ద‌క్ష‌ణాలు చేస్తారు. మ‌రి ప్ర‌స్తుతం ప‌రిస్థితులు బాలేని కార‌ణంగా ఎక్క‌డివారు అక్క‌డే లాక్ డ‌వున్ అవ్వ‌డంతో దేవుళ్ళ‌కి మొక్క‌ల సంగ‌తి ప‌క్క‌న పెడితే రోజు జ‌రిగే మాములు పూజ‌లు కూడా క‌ష్ట‌మ‌యిపోయాయి. అలాగే ఆ స్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో 'నేలకొండపల్లి' ఒకటిగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సెంటర్ నుంచి బౌద్ధ స్థూపానికి వెళ్లే మార్గంలో ఈ స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. స్వామివారు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది అదేమిటో ఒక‌సారి చూద్దాం...

 

పూర్వం ఇక్కడ ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. కుష్ఠు వ్యాధితో తాను పడుతున్న బాధల నుంచి విముక్తుడిని చేయమని వేంకటేశ్వరస్వామిని కోరుతూనే ఆయన తన తపస్సును కొనసాగించేవాడట. ఓ రోజు రాత్రి నిద్ర‌పోయిన‌ప్పుడు ఆయ‌న క‌ల‌ల‌లోఆ సాధువుకు స్వామి దర్శనమిచ్చి కుష్ఠు వ్యాధి నుంచి ఆయనను విముక్తుడిని చేస్తున్నట్టుగా చెప్పడమే కాకుండా, 'తిరునామం' రూపంలో తను వెలస్తున్నట్టుగా సెలవిచ్చాడట. దాంతో ఉదయాన్నే తనని తాను చూసుకున్న ఆ సాధువు, తనకి కుష్ఠు వ్యాధి ఆనవాళ్లు కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడట. ఆ తరువాత ఒక కొండ గుహలో స్వామివారు వెలసినట్టుగా గమనించిన ఆయ‌న‌ నిత్యపూజలు నిర్వహించినట్టుఅక్క‌డి స్థల పురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఇక్కడి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న వారికి వ్యాధుల నుంచి .. బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు న‌మ్ముతుంటారు.

 

అయితే ఏది ఏమైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ప‌రిస్థితులు బాలేని కార‌ణంగా ఏ ప్ర‌ద‌క్షిణాలైనా ఏవైనా మ‌న ఇంట్లోనే ఎంతో దైవ‌భ‌క్తితో పూజ‌లు చేసుకుంటూ దేవుని మ‌న‌సారా ఆరాధిస్తే చాలంటున్నారు చాలా మంది పెద్ద‌లు. మ‌రి వాళ్ళ మాట‌ల‌ను మ‌ట్టుబెట్ట‌కుండా వాటిని పాటిస్తే మ‌నం ఆయురారోగ్యాల‌తో ఉండ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: