కరోనా కారణంగా ప్రపంచం అంధకారంలో పడిపోయింది. ఈ వైరస్ నిర్మూలనకై ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు. కానీ ఈ మహమ్మారి ధాటి నుంచీ పూర్తిగా బయట పడేయగలిగే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. కానీ ఈ భారత దేశాన్ని కాపాడుకోవడానికి కొన్ని యుగాలుగా ఆచరిస్తూ వస్తున్న సనాతన ఆచారాలు, అద్భుతమైన శాస్త్రీయ పరమైన పద్దతులు మళ్ళీ ఇప్పుడు అవలభించాల్సిన పరిస్థితి ఎంతైన ఉంది. మరి పరుగులు పెట్టే  ప్రపంచంలో ఇది సాధ్యమా అనే అనుమానాన్ని ఫటాపంచలు చేశారు ప్రధాని మోడీ..

IHG

చప్పట్లు కొట్టి ఐక్యత చాటమని చెప్పగానే అందరూ చేసి చూపించారు. ఈ చప్పట్ల ప్రక్రియ వెనుక ఎలాంటి  అద్భుతమైన శక్తి దాగుందనేది అప్రస్తుతం, కానీ దేశ ఐక్యతని నిరూపించుకునేలా అందరూ ఒకే తాటిపై ఉన్నామని ప్రపంచ దేశాలకి చెప్పేలా మోడీ సంకల్పించిన ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది..మళ్ళీ తిరిగి మోడీ పిలుపు మేరకు 05-04-2020 తేదీ ఆదివారం అనగా ఈ రోజు రాత్రి 9 గంటలకి  9 నిమిషాల పాటు  ఇళ్ళలో లైట్లు ఆపేసి దీపాలు వెలిగించి మరొక్క సారి భారత దేశ ఐక్యతని చాటాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ..

IHG

 

చప్పట్లు కొడితే వైరస్ పారిపోతుందా...దీపాలు వెలిగిస్తే వైరస్ చచ్చి పోతుందా అంటూ మోడీ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మోడీ చేపట్టిన ఈ మహోన్నతమైన కార్యక్రమంపై శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి స్పందించారు. విమర్శలు చేస్తున్న సోకాల్డ్ వ్యక్తులపై నిర్మొహమాటంగా స్పందించారు. ఈ సమయంలో  గ్రహాలు ఏమి చేస్తున్నాయి, ఏ గ్రహం ఎక్కడ ఉందనే ఆలోచనలు పక్కనపెట్టి, ఐక్యతని చాటే ఈ అద్భుతమైన కార్యక్రమంపై నీళ్ళు చల్లకుండా , ఈ ఉపద్రవకరమైన సమయంలో మేము అందరం కలిసి ఉన్నామని ప్రజలు అందరూ ముక్త  కంఠంతో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

IHG

కొందరు సనాతన ధర్మాలపై , పద్దతులపై మాట్లాడుతున్న తీరు తాము కూర్చున్న చెట్టుని తామే నరుక్కున్నట్టుగా ఉందని, ఇలాంటి పద్దతులు మానవాళి వినాశనానికి దారి తీస్తాయని అలాంటి వారివలన ఉపయోగం ఉండదని అన్నారు . మనం అందరం ఒకలిసి ఏదైనా ఓ అద్భుతమైన కార్యక్రమం చేయాల్సిన సమయం ఇది, అన్ని వేళల ఇలాంటి అవకాశం దొరకదు, మనల్ని బండలు ఎత్తమని చెప్పలేదు, భూజలపై మోయలేని బరువు పెట్టలేదు, మరొక్క సారి మన ఐక్యతని నిరూపించుకోవడానికి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించమని చెప్పారు అది కూడా మనం చేయలేమా. ఒక్క సారి దీపాలు వెలిగించి చూపిస్తే ప్రకృతికి పులకరిస్తుంది కదా..ఎక్కడికి పోకుండా ఇంట్లోనే  ఉండి దీపాలు వెలిగించమనే కదా ప్రధాని చెప్పింది. ఈ మాత్రం మనం చేయలేమా..మన కుటుంభం, మన పిల్లలు, మన ఆరోగ్యం గురించి చెప్పేటప్పుడు మనం ఆచరించడంలో ఆలోచన చేయడం ఎందుకు అంటూ అందరిలో భక్తి తో కూడిన చైతన్య స్పూర్తిని నింపారు. మన దేశం, మన జాతి అందరూ బాగుండేలా మనం అందరం కలిసి ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని ముందుకు వెళ్లాలని సూచించారు.  కులమతాలకి అతీతంగా అందరూ నెయ్యి తో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించి మీ మీ ఇష్టదైవాలని ఈ ప్రపంచం , ఈ భూమి, మనుషులు అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా చేయమని ప్రార్ధించమని తెలిపారు...జీయర్ స్వామి ఇచ్చిన ఈ సందేశం ఎంతో మందిని ఆలోచింప చేస్తోంది..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: