వేంక‌టేశ్వ‌ర‌స్వామి అంటే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఆయ‌న‌ను కొలిచే భ‌క్తులు కూడా చాలా ఎక్కువ‌. వేంకటేశ నమో  దేవో న భూతో న భవిష్యతి’ అన్నట్టు వేంకటాద్రిని మించిన క్షేత్రం ఈ బ్రహ్మాండంలో లేదనే చెప్పాలి. అలాగే వేంకటేశ్వర స్వామిని మంచిన దేవుడు భూత, భవిష్యత్తు కాలాల్లో లేడనేది కూడా మ‌న  భవిష్య పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అలిగి వెల్లిపోయిన శ్రీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహా విష్ణువు..వేంకటేశ్వర స్వామిగా వెలిసిన ఇల వైకుంఠమే తిరుమల తిరుప‌తి దేవ‌స్థానంగా నిలిచింది. వేం అంటే పాపాలు.. కట అంటే నశింపచేసేది.. మనుషుల పాపాలను నశించచేసే ‘వేంకటేశ్వర స్వామి’గా కోట్లాది భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తున్నాడు. అలాంటి వేంకటేశ్వర స్వామి తెలుగు నేలపై కొలువై ఉండటం అనేది తెలుగువాళ్లు చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి అంటే తెలుగు వారికి ఎంతో ప్రీతిక‌ర‌మైన దైవం అని చెప్పాలి. ఎక్కడున్న ఎంతో భక్తితో స్వామిని కొలుస్తారు.  తాజాగా ఝార్ఖండ్ రాష్ట్రంలో చక్రధర్ పూర్‌లో ఎంతో మంది తెలుగువాళ్లు ఉద్యోగ రీత్యా అక్క‌డ‌ స్థిర పడి ఉన్నారు. వారంతా కూడా స్వాతంత్య్రానికి ముందుగానే 1928లో ఇక్క‌డ ఒక అసోసియేషన్‌గా ఏర్పడి అన్ని పండగలను ఎంతో ఘనంగా చేసుకుంటారు.

 

ఝార్ఖండ్‌కు చెందిన ఈ తెలుగు అసోసియేషన్ వాళ్లు.. 1983లో తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం ఎలా అయితే ఉంటుదో అలానే  ఈ శ్రీవారి  ఆలయాన్ని నిర్మించారు. ప్రతి సంవ‌త్స‌రం ఇక్క‌డ‌ వైశాక మాసంలో వచ్చే శ్రవణం నక్షత్రం రోజున వీరు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. అంతేకాదు ఇక్కడి పూజలు కూడా అన్నీ తిరుమలలో  ఏ విధంగా చేస్తారో అలానే ఇక్క‌డ కూడా నిర్వహిస్తారు. బిహార్ నుంచి ఝార్ఖండ్ విడిపోక ముందే ఈ వేంకటేశ్వరాలయం ఒక రిజిస్టర్ అయింది.

 

ఇక్క‌డ ప్ర‌తీ సంవ‌త్స‌రం  మే 24వ తేది నుంచి 30 వ తేది వరకు ఈ బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు మ‌రి ఈ సారి అలా జ‌రిగేలా లేదు ఈ క‌రోనా కార‌ణంగా బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతాయో లేదో అని ఎంతో మంది భ‌క్తులు కాస్త నిరాశ చెందుతున్నారు. అయితే ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను స్వ‌యంగా తిరుమల పండితులే వ‌చ్చి ఇక్క‌డ‌ నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: