మోహినీ భస్మాసుర కధ తెలియని భారతీయుడు ఉండడు. అలాగే క్షీర సాగర మధనం జరిగినప్పుడు శ్రీ మహా విష్ణువు మోహినీ అవతారం ఎత్తి, రాక్షసుల కళ్ళు గప్పి  అమృతాన్ని దేవతలకి అందించే విధానం ఇప్పటికి మన కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో శంకరుడు మోహినిగా మారిన విష్ణువు ని  మోహించడం ఆ తరువాత మోహిని వెంట పడటం ఇవన్నీ అందరికి తెలిసినవే. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే..

IHG

పరమ శివుడు , మోహినిగా మారిన విష్ణువు వెంట పడిన సమయంలో మోహిని తలనుంచీ ఓ పువ్వు రాలి పడగా ఆ పువ్వుని  పరమేశ్వరుడు వాసన చూసి, తనకి పట్టిన మాయని వీడి విష్ణువుని గుర్తించాడని అదే సమయంలో వెనుక వైపు మోహినిగా, ముందు వైపు విష్ణువుగా శ్రీ మహా విష్ణువు ఆ ప్రాంతలో  అవతరించాడని.  ఆ పువ్వు రాలి పడింది కాబట్టి ఆ ప్రాంతానికి ర్యాలి అని పేరు వచ్చిందనేది ఇతిహాసాలలో స్పష్టంగా చెప్పబడింది. ఈ ఆలయంలో మోహిని అవతారంలో ఉన్న విష్ణువు సాలిగ్రామ విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు..ఈ విగ్రహానికి ఉన్న విశిష్టతలు, ఈ ఆలయానికి ఎదురుగా ఉండే పరమశివుడి ప్రత్యేకతలు  తెలుసుకుంటే శరీరం మనస్సు పులకరించి పోతుంది. 

IHG

తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెం కి అత్యంత దగ్గరగా ఉన్న ఈ ర్యాలీ గ్రామం ప్రకృతి రమణీయతతో స్వర్గాని తలపిస్తుంది. ఈ ఆలయ ఆవిర్భావ  చరిత్రకి మరొక కధ కూడా ప్రాచుర్యంలో ఉంది. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అప్పటి కాలంలో ఈ ప్రాంతం అంతా దట్టమైన అరణ్యం కావడంతో చోళ రాజులలో ఒకరైన విక్రమ దేవుడు ఈ ప్రాంతంలో  వేటకు వెళ్లి ఈ గుడి ఉన్న ప్రాంతంలో చెట్టు కింద సేద తీరుతుండగా కలలో మహా విష్ణువు కనపడి తన విగ్రహం రధం యొక్క శీల పడిన  ప్రాంతంలో ఉందని అక్కడ తనకి గుడి కట్టించమని చెప్తాడు దాంతో రాజు త్రవ్వి విగ్రహాన్ని కనుగొని గుడి కట్టిస్తాడు. రధ శీల పడింది కాబట్టి ఈ ప్రాంతాన్ని ర్యాలి అంటారనే కద కూడా ప్రాచుర్యంలో ఉంది.

IHG
జగన్మోహిని అవతారంతో ఉన్న ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఐదడుగులు ఉన్న సాలిగ్రామ శిల ఇది. ముందు మహా విష్ణువు ఉండగా వెనుక మోహిని అవతారంలో విష్ణువు కొలువై ఉంటాడు. ముందు భాగంలో విష్ణువుకి నీడని ఇస్తున్నట్టుగా పొన్న చెట్టు, దశావతారాలు, ఆదిశేషు, నారద మునీంద్రులు ఇలా సకల దేవతలు కొలువై ఉంటారు.  వెనుక వైపు పద్మిని జాతి స్త్రీ అలంకరణ, గోళ్ళతో సహా జీవం ఉట్టిపడేలా అద్భుతంగా ఉంటుంది. ఇక మరొక విశేషం ఏమిటంటే విష్ణువు పాదాల నుంచీ నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న మరో విశిష్టత ఏమిటంటే..ఈ ఆయలయానికి ఎదురుగా ఈశ్వరుడు ఉమా కండలేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు బ్రహ్మ సృష్టించిన లింగంగా ఈ శివాలయం పేరొందింది. ఈ ఆలయానికి ఉన్న విశేషం ఏమిటంటే ఇక్కడ అభిషేకించ బడిన నీరు  బయటకి వెళ్ళడానికి కానీ, లోపలి వెళ్ళడానికి కానీ మార్గం లేదట. మోహినీ అవతారంలో విష్ణువుని చూసిన శంకరుడు శరీరంపై నీరు పడగానే హరించుకుపోతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పుణ్య క్షేత్రాన్ని ఒక్క సారి దర్శించుకుని తరించండి..

మరింత సమాచారం తెలుసుకోండి: