శ్రీరామ జయరామ జయ జయరామ..!

 

అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం 
దనుజ వనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి.

 

అసమానమైన బలము కలవాడా! 
బంగారు వర్ణముతో మెరిసిపోయే దేహము కలవాడా! అశోకవనమును నాశనము చేసినవాడా!
జ్ఞానులలో అగ్రగణ్యుడిగా పేర్కొనబడినవాడా!
సర్వ గుణములకు నిధి వంటి వాడా!
వానర శ్రేష్ఠులలో అగ్రగణ్యుడా!
శ్రీరామచంద్రునికి అత్యంత ప్రియమైన భక్తుడా! వాయుపుత్రుడా!నీకు నమస్కారము.!

 

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్. 
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్.

 

సాగరమును ఆవుడెక్కలా భావించి దాటినవాడా! రాక్షసులను దోమలలాగా నలిపినవాడా! రామాయణమనెడి మహామాలలో రత్నము వంటి వాడా! వాయుపుత్రుడా! నీకు నమస్కారము.!

 

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్ 
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్. 
బాష్పవారి పరిపూర్ణ లోచనమ్ 
మారుతిం నమత రాక్షసాంతకమ్.

 

ఎక్కడెక్కడ రఘునాథుడు కీర్తింపబడతాడో 
అక్కడక్కడ నీళ్ళు నిండిన కళ్ళతో శిరస్సు వంచి నమస్కారము చేస్తూ ఉంటావు. రాక్షసుల అంతు చూసే వాయుపుత్రా!నీకు నమస్కారము! 

 

శ్రీగురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారి |

 

శ్రీ గురుదేవులు ఆంజనేయస్వామి చరణ ధూళిచే 
నా హృదయ దర్పణము శుభ్రపరచి చతుర్విధ పురుషార్థంబులనిచ్చు శ్రీరామచంద్రుని కీర్తిని 
గానము చేతును. 

 

బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేస వికార |

 

నా బుద్ధిహీనతను తెలిసినవాడనై ఓ పావనతనయా! 
ఓ హనుమా! నిన్ను స్మరింతును. ఓ ప్రభూ! నాకు బలము బుద్ధి విద్యలను ప్రసాదించి నాలోని పంచ క్లేశములను, షడ్వికారములను హరింపుము.  

   

చౌపాయీ.

జయ హనుమాన జ్ఞానగుణసాగర - 
జయ కపీశ తిహు లోక ఉజాగర | 1

 

అనంతములైన జ్ఞాన గుణముల యందు పరిపూర్ణుడైన 
ఓ హనుమా! నీకు జయము. మూడు లోకాలను ప్రకాశింప చేసే ఓ కపీశ్వరా 
నీకు జయము.

                                

రామదూత అతులిత బలధామా - 
అంజనిపుత్ర పవనసుత నామా | 2

 

శ్రీరామచంద్రుని రాయబారీ! 
సాటిలేని బలము గలవాడా! 
అంజనీదేవి కుమారుడా! 
పవన సుతుడను నామము కలవాడా!    

 

మహావీర విక్రమ బజరంగీ - 
కుమతి నివార సుమతి కే సంగీ | 3

 

మహావీరుడా! వజ్రము వంటి దృఢమైన దేహము 
కలిగిన పరాక్రమవంతుడా! దుర్బుద్ధిని తొలగించువాడా! 
మంచిబుద్ధి గలవారికి సహాయపడువాడా!

 

కంచన వరన విరాజసువేసా - 
కానన కుండల కుంచిత కేశా | 4

 

బంగారువన్నెతో మంచి వేషముతో ప్రకాశించువాడా! చెవులకు కుండలములు అలంకారములుగా కలిగి ఉంగరములు తిరిగిన తలవెంట్రుకలు కలిగినవాడా!

 

హాథ వజ్ర అరుధ్వజా విరాజై - 
కాంధే మూంజ జనేవూ సాజై | 5

 

చేతిలో వజ్రమును ఆయుధమును మరియు జండాను ధరించి విరాజిల్లువాడా! భుజమందు ముంజ గడ్డితో చేయబడిన యజ్ణోపవీతముతో శోభిల్లువాడా!  

   

శంకరసువన కేసరీ నందన - 
తేజ ప్రతాప మహాజగ వందన | 6

 

పరమేశ్వరుని పుత్రుడా! కేసరీ కుమారుడా! 
తేజస్సు ప్రతాపములతో జగత్తంతటిచే పూజింపబడువాడా!  

 

విద్యావాన గుణీ అతిచాతుర - 
రామ కాజ కరివే కో ఆతుర | 7

 

విద్వంసుడా! గుణవంతుడా! అతి చతురుడా!
శ్రీరామ కార్యనిర్వహణలో ఎంతో ఆత్రము, 
ఆతురత కలవాడా!

                

ప్రభు చరిత్ర సునివేకో రసియా - 
రామ లఖన సీతా మన బసియా | 8

 

ప్రభువగు శ్రీరాముని చరిత్ర వినుటయందు 
ఆసక్తి కలవాడా! సీతారామ లక్ష్మణులను హృదయమునందు ధరించువాడా!

                   

సూక్ష్మ రూపధరి సియహిదిఖావా - 
వికట రూప ధరి లంక జరావా | 9

 

సూక్ష్మ రూపమును ధరించి సీతాదేవికి కనిపించితివి. పిదుప భయంకర రూపమును ధరించి లంకాపురిని కాల్చివేసితివి.

 

భీమ రూప ధరి అసుర సంహారే - 
రామచంద్రకే కాజ సంవారే | 10

 

భయంకర వేషమును ధరించి లంకాపురి యందున్న రాక్షసులను చంపి శ్రీరామచంద్రుని సకల కార్యములను చక్కచేసితివి.    

 

లాయ సజీవన లఖన జియాయే - 
శ్రీరఘు వీర హరషి ఉరలాయే | 11

 

సంజీవనీ మూలిక తెచ్చి లక్ష్మణుని బ్రతికించితివి. అందుకు శ్రీరఘురాముడు సంతోషించి నిన్ను తన హృదయమునకు హత్తుకొనెను.  

 

రఘుపతి కీన్హీ బహుత బడాయీ - 
కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12

 

శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా పొగడి 
"సోదరా! నీవు నాకు భరతునితో సమానముగా ప్రియమైన వాడవు" అని పలికెను.  

 

సహస్ర వదన తుమ్హరో యస గావై - 
అసకహి శ్రీపతి కంఠ లగావై | 13

 

"నీ కీర్తిని భవిష్యత్తులో అందరూ వేనోళ్ళ గానం చేసి తరించెదరు గాక!" అని పలికి శ్రీరాముడు 
నిన్ను కౌగలించుకొనెను.  

 

సనకాదిక బ్రహ్మాది మునీశా - 
నారద శారద సహిత అహీశా | 14

 

సనకాది ఋషులు, మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు, నారదుడు సరస్వతీదేవి మరియు ఆదిశేషుడు 

 

యమ కుబేర దిగపాల జహాతే - 
కవి కోవిద కహి సకే కహా తే | 15

 

యముడు కుబేరుడు దిక్పాలకులు నీ మహిమను వర్ణింపజాలనప్పుడు భూలోకమున కవులు పండితులు ఎట్లు సాధ్యమగును.     

 

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా - 
రామ మిలాయ రాజపద దీన్హా | 16

 

నీవు సుగ్రీవునికి ఉపకారమొనర్చితివి. 
రామునితో అతనికి సఖ్యము గావింపచేసి 
రాజ్యపదవిని ఇప్పించితివి.  

 

తుమ్హరో మంత్ర విభీషణ మానా - 
లంకేశ్వర భయే సబ జగ జానా | 17

 

నీ సలహాను పాటించి విభీషణుడు లంకకు రాజైన సంగతి లోకమంతటికీ తెలిసినదే.   

 

యుగ సహస్ర యోజన పర భానూ - 
లీల్యో తాహి మధుర ఫల జానూ | 18

 

రెండువేల యోజనములు అనగా 16 వేల మైళ్ళ దూరమున ఉన్న సూర్యుని తీయని పండుగా భావించి దానిని మింగితివి.   

 

ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ - 
జలధి లాంఘియే అచరజ నాహీ | 19

 

శ్రీరామచంద్రుడిచ్చిన ఉంగరమును నోట నుంచుకొని (రామ నామమును జపిస్తూ) సముద్రమును దాటితివి. ఇందులో ఆశ్చర్యము లేదు.     

 

దుర్గమ కాజ జగత కే జేతే - 
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20

 

ప్రపంచమునందు కఠినమైన కార్యములు ఎన్నెన్ని ఉన్నాయో అవి అన్నియూ నీ అనుగ్రహము వలన సరళములు కాగలవు.  

 

రామ దుఆరే తుమ రఖవారే - 
హోత న ఆజ్ఞా బిను పైసారే | 21

 

శ్రీరాముని ద్వారపాలకుడవు నీవు. 
నీ ఆజ్ఞలేనిదే లోపలికి వెళ్ళుటకు ఎవ్వరికీ వీలులేదు. 
(నీ అనుగ్రహము లేకుండా రాముని కృప ఎవరికీ దొరకదు)

    

సబ సుఖ లహై తుమ్హారీ శరణా - 
తుమ రక్షక కాహూ కో డరనా | 22

 

నిన్ను శరణు పొందిన వారికి సమస్త సుఖములు లభించును. 
నీవు రక్షకుడిగా ఉండగా ఎవరికినీ 
భయపడవలసిన పనిలేదు. 

 

ఆపన తేజ సంహారో ఆపై - 
తీనోం లోక హాంక తే కాంపై | 23

 

నీ యొక్క ప్రకాశమునకు బలపరాక్రమములను సంభాళించుకొనుటకు నీవే సమర్థుడవు. 
నీ పెద్దకేక విని ముల్లోకములు కంపించును.  

 

భూత పిశాచ నికట నహి ఆవై - 
మహావీర జబ నామ సునావై | 24

 

ఓ మహావీరా! నీ నామస్మరణ వింటే భూతప్రేత పిశాచములు దగ్గరకు రావు. 

 

నాసై రోగ హరై సబ పీరా - 
జపత నిరంతర హనుమత వీరా | 25

 

నిరంతరము వీర హనుమంతుని జపించినచో 
సమస్త రోగములు నశించును. అన్ని పీడలు హరించుకుపోవును.

  

సంకటసే హనుమాన ఛుడావై - 
మన క్రమ వచన ధ్యాన జో లావై | 26

 

ఎవరైతే మనోవాక్కాయ కర్మలచే తనను ధ్యానించినచో వారిని ఆంజనేయుడు సమస్త సంకటముల నుండి విముక్తి చేయును.  

 

సబ పర రామ తపస్వీ రాజా
తిన కే కాజ సకల తుమ సాజా | 27

 

శ్రీరామచంద్రుడు తాపసులకు అందరకు గొప్పవాడు. ప్రభువు వంటివాడు. ఆయన సకల కార్యములను ఓ ఆంజనేయా! 
నీవు చక్కగా సవరించుచుందువు.    

 

ఔర మనోరథ జో కోయీ లావై - 
సోయీ అమిత జీవన ఫల పావై | 28

 

ఎవరు ఏయే కోర్కెలతో శ్రీ హనుమంతుని సేవింతురో వారికి ఆ కోర్కెలు తీరి అనంతమైన జీవన ఫల ప్రాప్తి కలుగును.

 

చారోం యుగ పరతాప తుమ్హారా - 
హై పరసిద్ధ జగత ఉజియారా | 29

 

ఓ హనుమా! నీ యొక్క ప్రతాపము నాలుగు యుగములలోనూ ప్రసిద్ధమైనవి. జగత్తంతయు నీ కీర్తి కాంతులతో ప్రకాశమానమై ఉన్నది.    

 

సాధు సంతకే తుమ రఖవారే - 
అసుర నికందన రామ దులారే | 30

 

సాధన చేసేవారికి చక్కగా తపస్సు చేసేవారికి 
నీవు రక్షకుడవు. దుర్మార్గులను నాశనము చేయువాడవు మరియు శ్రీరామునికి అత్యంత ప్రియమైనవాడవు. 


 
అష్ట సిద్ధి నవ నిధికే దాతా - 
అసవర దీన జానకీ మాతా | 31

 

అష్టసిద్ధులను నవవిధులను ప్రసాదింపగలుగునటుల జానకీ మాత నీకు వరమొసగెను.   

 

రామ రసాయన తుమ్హరే పాసా - 
సదా రహో రఘుపతి కే దాసా | 32

 

రామరసాయనము నీవద్ద గలదు. 
నీవు ఎల్లప్పుడూ శ్రీరామచంద్రుని సేవకుడవై ఉందువు.

 

తుమ్హరే భజన రామ కో పావై - 
జనమ జనమ కే దుఃఖ బిసరావై | 33

 

నీయొక్క భజన వలన రామానుగ్రహము పొంది 
జన్మ జన్మంతారముల దుఃఖముల నుండి 
విముక్తి పొందెదరు.     

 

అంత కాల రఘువర పుర జాయీ - 
జహా జన్మ హరిభక్త కహాయీ | 34

 

(నిన్ను భజించినవారు) మరణించిన పిదప వైకుంఠమునకు పోవుదురు. మరల జన్మించినచో వారు హరిభక్తులుగా 
ప్రసిద్ధి చెందుదురు.    

 

ఔర దేవతా చిత్త న ధరయీ - 
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35

 

ఇతర దేవతలకు తన హృదయము నందు స్థానమీయక శ్రీ హనుమంతునే ధ్యానించు వారికి (ఆంజనేయుడు) సమస్త సుఖములను ఒసంగును.   

 

సంకట కటై మిటై సబ పీరా - 
జో సుమిరై హనుమత బలవీరా | 36

 

మహాబలుడగు ఆంజనేయుని ఎవరైతే స్మరింతురో 
వారి సంకటములన్నియు తొలగి పీడలన్నియు నశించును.  

 

జై జై జై హనుమాన గోసాయీ - 
కృపా కరహు గురు దేవకీ నాయీ | 37

 

జితేంద్రియుడైన ఓ ఆంజనేయ! 
నీకు జయము జయము జయము. 
గురుదేవుని వలె (నాయందు) దయ జూపుము.    

 

జో శత బార పాఠ కర కోయీ - 
ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38

 

ఎవరైతే (ఈ చాలీసాను) నూరుమార్లు పఠనము చేయుదురో వారికి అన్ని బంధనములు వీడి 
పరమానంద ప్రాప్తి కలుగును.   

 

జో యహ పఢై హనుమాన చలీసా - 
హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39

 

ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను పఠింతురో 
వారికి పార్వతీపరమేశ్వరుల సాక్షిగా సిద్ధికలుగును.  

 

తులసీదాస సదా హరి చేరా - 
కీజై నాథ హృదయ మహ డేరా | 40

 

ఓ నాధా (ఆంజనేయా!) ఈ తులసీదాసు ఎల్లప్పుడూ 
హరి సేవకుడే కావున నా హృదయమందు నివసింపుము.

   

దోహా:

పవనతనయ సంకట హరణ మంగళ మూరతి రూప
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప |

 

సమస్త సంకటములను హరింప చేసెడివాడవు. 
మంగళ స్వరూపుడవు, సమస్త దేవతలకు నాధుడవు అయినా ఓ ఆంజనేయా! సీతారామ లక్ష్మణ సహితుడవై నా హృదయమున వసింపుము.

మరింత సమాచారం తెలుసుకోండి: