ముస్లింలు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకునే పెద్ద పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫిత‌ర్‌) ఈ నెల‌లో ముస్లింలు చాలా ప‌విత్రంగా శ్ర‌ద్ధ‌తో నియ నిబంధ‌న‌ల‌తో ఉపవాస దీక్ష‌ను శ్ర‌ద్ధ‌గా పాటిస్తారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన మాసం రంజాన్‌. ఈ రంజాన్ నెల‌ను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెల‌ను ముస్లింలు దైవమాసంగా విశ్వసిస్తారు. నెలరోజులపాటు ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక భావ‌న క‌లిగి ఉంటారు. అలాగే ఈ నెల మొత్తం ఎక్కువ‌గా  దానాలు, ధర్మాలు ఇవన్నీ రంజాన్‌ మాసంలో భాగం. ఈ నెల‌లో ముస్లింలు ఎక్కువ‌గా దాన ధ‌ర్మాలు చేస్తారు. ప్రతి ముస్లిం జీవిత సార్థకతకు దేవుడు ఇచ్చిన వరం రంజాన్ గా భావిస్తారు‌. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెల బాలచంద్రుడు కానరావడంతో ముగుస్తుంది. పవిత్ర రంజాన్ మాసం చివరి రోజున ఈద్‌ ఉల్‌ ఫితర్‌ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు.

 

ముస్లిం సోదరుల రంజాన్ ఉపవాసాలు ముగియ‌గానే పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలపడానికి కొన్ని పవిత్రమైన వాక్యాలు, వాట్సాప్ స్టేటస్‌లు, ఇమేజ్‌లు అందిస్తున్నాం. అల్లా అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, జీవితాన్ని సుఖశాంతులతో ఆనందంగా గడపాలని కోరుకుంటారు. క్రమ శిక్షణ, దాతృత్వం, ఇవ‌న్నీ కూడా పవిత్ర రంజాన్ మాసం. సక్రమ మార్గంలో నడుచుకుంటూ, దేవుని యందు భక్తి విశ్వాసములు కలవారికి వారి కర్మానుసారం మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది.

 

ఇస్లాంలో అంటరానితనంఅనేది ఎక్క‌డా లేదు. రాజు, రైతు, ధనిక, పేద, జాతి, వర్గ బేధాలు లేకుండా అందరూ ఒకరికొకరు భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి నమాజుకై రోజుకు ఐదు సార్లు నిలబడి విశ్వమానవ సోదర భావాన్ని చాటుతారు. ఈ నెల రోజులు కూడా ఎంతో దీక్ష‌తో ఉపవాసం చేస్తారు. సాయంత్రం ఉప‌వాసం ఉప‌సంహ‌రించుకునేముందు ఖ‌ర్జూర‌పండు తిని ఉప‌వాసాన్ని తీస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: