హిందువులు ఎక్కువ‌గా పూజించే దేవుడు వేంక‌టేశ్వ‌ర‌స్వామి. ఇక ఈయ‌న‌ను బాలాజీ అని ఏడుకొండ‌లవాడు అని పిలుస్తారు. వేంక‌టేశ్వ‌ర‌స్వామి అన‌గానే అంద‌రికి గుర్తువ‌చ్చేది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. తిరుమలలో ఏడు కొండల పైన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం సందర్శించ‌డానికి ప్రపంచం నలుమూలల‌ నుండి లక్షల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు. ఈ పుణ్య‌క్షేత్రాన్ని సంద‌ర్శించ‌డానికి భ‌క్తులు రోజు కొన్ని ల‌క్ష‌ల్లో ఇక్క‌డ‌కు వ‌స్తుంటారు. అయితే ఈ స్వామి ఏడుకొండలలో వెలిసే ముందు తిరుమల కాకుండా ఏడు ప్రదేశాలలో ఆయ‌న‌ నివాసం ఉన్నట్లు పురాణాలూ చెబుతున్నాయి. ఆలా అయన నివాసించిన ప్ర‌దేశాలేంటో ఓసారి చూద్దాం.  ఏడూ ప్రాంతాల్లోని ఒక ప్రదేశం మనం ఇప్పుడు చెప్పుకునే అప్పలాయ గుంట. మరి ఏడుకొండల వెంకన్న స్వామి ఈ ఆలయంలో స్వయంభువుగా ఎలా వెలిసాడు? అప్పలయ్య కథ ఏంటి? ఆ ఆలయం చ‌రిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

 


ఈ ఆల‌యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో తిరుమలలోని ప్రధానమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి చుట్టూ ఉన్న మరో ఏడూ పురాతన ఆలయాలలో అప్పలాయ గుంట  ఒకటి. దీనినే ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం అని అంటుంటారు.  ఈ ఆలయం చుట్టూ పచ్చటి పొలాలు ఉండి ఒకవైపు నల్లని కొండ ఉన్నందున ఇక్కడ ఒక ప్రత్యేకమైన అధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది.

 


ఇక పురాణానికి వస్తే,  తిరుమల శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతిదేవిని పెళ్లి చేసుకున్నార‌ట‌, పసుపు దుస్తులతోనే తిరుమలకు బయల్దేరి వస్తూ ఈ ప్రాంతంలో ఆయ‌న కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటారు. అక్కడ అదే సమయంలో సిద్ధేశ్వర యోగి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా దివ్యదంపతులు కనపడేసరికి వారి పాదాల మీద పడి వారిని అక్కడే ఉండిపొమ్మని ప్రార్థిస్తాడు. స్వామి వారు చిరునవ్వుతో అతని వినతిని మన్నిస్తాడు. అలా ప్రసన్నం చేసుకోగానే వెలసినవాడు కాబట్టి అక్కడి దేవుడిని ప్రసన్న వేంకటేశ్వరస్వామి అంటారు. ఇక అప్పులయ్యా గుంట అనడానికి కారణం ఏంటి అంటే, పూర్వం ఈ ప్రాంతాన్ని అన్ఱుణ అంటే రుణం లేని సరోవరం అని పిలిచేవారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడు.పేరుకు తగ్గట్టుగానే అతను వూరిలో అందరి దగ్గర అప్పులు చేసేవాడు. అందుకే ఆయ‌న‌కు ఆ పేరు వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: