త్రిమూర్తుల్లో శివ భగవానుడు ఒకరు. సాధారణంగా మనం విష్ణువు యొక్క 10 అవతారాల గురించి వినే ఉంటాం. కానీ శివునికి అవతారాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శివ భగవానుడికి 19 అవతారాలు ఉన్నాయి. దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు మానవ రూపంలో ఉంటాయి. శివ భగవానుడి యొక్క ప్రతి అవతారం ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ప్రతి యొక్క అవతారానికి మానవాళి శ్రేయస్సు మరియు నిర్ధిష్ట ప్రయోజనం ఉద్దేశంగా ఉన్నాయి. 
 
శివుని అవతారాలలో నంది అవతారం ఒకటి. దేశంలోని చాలా ప్రాంతాలలో శివుడిని నంది రూపంలో పూజిస్తారు. నంది రూపంలో శివుడు పశువులకు రక్షకుడిగా ఉంటాడని భావిస్తారు. శివుడి మరో అవతారం వీరభద్ర అవతారం. సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న అనంతరం శివునికి చాలా కోపం రావడంతో తలలో ఉన్న వెంట్రుకను తెంపి మైదానంలోకి విసరగా ఆ వెంట్రుక నుంచి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను. 
 
శివుని అవతారాలలో అశ్వత్థామ అవతారం కూడా ఒకటి. శివుడు క్షీరసాగరమథనంలో ప్రాణాంతకమైన విషంను తీసుకోగా విష్ణువు శివుని గొంతు నుండి విషం బయటకు రాకుండా వరం ఇచ్చాడు. అప్పుడు శివుడు విష్ణువుకు భూమిపై ద్రోణ కుమారుడిగా పుట్టి క్షత్రియులను చంపుతాడని వరం ఇవ్వగా విష్ణువు అశ్వత్థామగా జన్మించాడు. శివుడి మరో అవతారాలలో శరభ అవతారం ఒకటి. విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవడానికి శివుడు శరభ అవతారం ఎత్తాడు. 
 
గ్రిహపతి అవతారంలో శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడి ఇంట కొడుకుగా జన్మించగా గ్రిహపతికి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకు చెప్పాడు. గ్రిహపతి మరణాన్ని జయించాలని కాశీకి వెళ్లి శివుని అనుగ్రహం చేత మృత్యువును జయించాడు. శివుడి అవతారాలలో హనుమాన్ అవతారం ముఖ్యమైనది. శివుడు పిప్లాద్ అవతారం, భైరవ అవతారం, దుర్వాస అవతారం, వృషభ అవతారం, యతినాథ్ అవతారం, కృష్ణ దర్శన్ అవతారం, భిక్షువర్య అవతారం, సురేశ్వర్ అవతారం, కిరీట్ అవతారం, సుంతన్ తారక అవతారం, బ్రహ్మచారి అవతారం, యక్షేశ్వర్ అవతారం, అవధూత్ అవతారాలలో కూడా కొలువై ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: