శబరిమల.. కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్న‌ అయ్యప్పను హిందువులు హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు.  చుట్టూ దట్టమైన అడవులతో ఉన్న ప్రఖ్యాతి గడించిన పుణ్యక్షేత్రం ఇది. సహజసిద్దమైన ప్రకృతి ఒడిలో పంబా నది ఒడ్డున పశ్చిమ కనుమల పర్వత శ్రేణులలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఏడాదిలో కొద్దిరోజులుమాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయదర్శనానికి వచ్చే భక్తులు 41రోజులపాటు దీక్ష చేస్తారు.కఠిననియమాలతో దీక్ష చేసి ఇరుముడులతో వచ్చి స్వామిని దర్శించుకుంటారు. దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏట నవంబరు నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. 

 

ఆ సమయంలో ఈ ఆలయానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వస్తుంది. ఇక్కడ ఆలయంలో తయారు చేసె ప్రసాదం అమ్మకం ద్వారా ఏటా ముప్పై కోట్ల రూపాయలు వస్తుంది. ఇక ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అందుకే కేరళలో ఉన్న ఈ ఆలయం దేశ వ్యాప్తంగా భక్తులు కలిగిన ఆలయం. అయితే శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి ప్ర‌తి సంవ‌త్స‌రం పూజారి(మేల్ శాంతి) మారుతూ ఉంటారు. 

 

వీరిని ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకొంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని సెలక్టు చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచారు. ఆ త‌ర్వాత‌ అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరు వస్తే, వారు ఆ సంవత్సరనికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు. కాగా, ఇక్కడి దేవాలయానికి ఉండే పచ్చని చెట్లు, ప్రవాహాలు మరియు పచ్చిక బయళ్ళ లో నుండి ఉండే కాలిబాట లో ప్రయాణం ప్రతిఒక్కరికి భగవత్ ప్రేరేపిత అనుభవం గా ప్రతి ఒక్కరు తమ జీవిత కాలం లో చవి చూడ వలసిన ఒక అద్భుతం.

  
  

మరింత సమాచారం తెలుసుకోండి: