కలియు దైవంగా భావించి సకల సుగుణాల సమ్మోహన స్వరూపం శ్రీ సాయిబాబా. బాబా జ్ఞాన వికాసాల పెన్నిధి. బాబా సన్నిధి మనలో వికాసాన్ని కలిగిస్తుంది. బాబా దర్శన మాత్రంతోనే మనోవికారాలు, మనః చాంచల్యాలు పాటాపంచలైపోతాయి.  సాయి తత్వం భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఓర్పు, దయ, ప్రేమ, సహనం, వినయం, విధేయత, ఋజువర్తన, సత్యశీలం, సేవాభావాల మేళవింపు. ఎవరికీ అర్థంకాని ఉపనిషత్తులలోని భావాలను, వేదాల్లోని సారాన్ని బాబా చిన్న చిన్న మాటలు, హితోక్తులతో సులభంగా అర్థమయ్యేలా చెప్పారు.  బాబాకు ధనిక, బీద, చిన్న, పెద్ద తారతమ్యాలు లేవు. అందరికీ సమానంగా ప్రేమను పంచారు.

IHG

మనుషుల పాపాలు తొలగించి జ్ఞాన దీపాలు వెలిగించడానికి, ఆదర్శ జీవనానికి బాటలు వేసి, జీవిత పరమార్థాన్ని చాటడానికి ఈ భూమిపై మానవరూపంలో అవతరించిన దైవం సాయిబాబా.  పరిపూర్ణ వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానం ముప్పేటలా అలముకున్న సాయి తత్త్వం ఈ జగత్తులోని సర్వంలోనూ చైతన్యమై ప్రసరిస్తూ ఉంటుంది. బాబా బోధన ఆదర్శ జీవనానికి సాధన! బాబా లీలలు దుష్ట బుద్దులు, ఆవ లక్షణాలను రూపుమాపుతాయి.

 

బాబా మహిమలు మనో వికారాల్ని విరిచేసి బతుకుల్ని తీయబర్చే అమృత గుళికలు. బాబా చెప్పిన సూక్తులు భావి జీవితానికి స్పూర్తిదాయకాలు. బాబా హితోక్తి మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచి. సాయి తత్త్వంలోని జ్ఞాన వికాసాన్ని మానవత్వాన్ని వంటపట్టించుకుంటే బతుకు ఆనందమయమవుతుంది. జీవితం ధన్యమవుతుంది. బాబా చూపింది సత్యమార్గం. ఆ బాటలో నడిచి మంచిని పెంచుకోమన్నారు. సాయి బోధనలను మనసా, వాచా, కర్మణా ఆచరిస్తే బతుకులు తీయనవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: