తిరుమలలో ఏడుకొండల మీద ఉన్న దేవ దేవుడు వెంకటేశ్వర స్వామి గురించి మీ కోసం కొన్ని విషయాలు. తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం మాత్రమే గుర్తుకొస్తుంది. అప్పటి సేవలను బట్టి... చక్కెర పొంగళి, పెరుగన్నం, ప్రసాదాలూ స్వామివారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి... స్వామికి కమ్మని దోసెలు పెడతారని తెలుసా ...? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా మీకు ..? ఇవి మాత్రమే కాదు... స్వామి వారికీ పూట పూటకూ ఒక మెనూ ...! అందులోనూ ఋతువులను బట్టి ఆహారం ...! స్వామివారికి సకల విధమైన నైవేద్యం అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు శ్రీ రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’  (స్వామివారి పవిత్ర ప్రసాదాలు) అనే పుస్తకం ఇంతక ముందు రాశారు. ఇకపోతే అందుకు సంబంధించిన తొలిప్రతిని ఆయన ఆనాటి భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్‌ ముఖర్జీకి అందించారు. ఏడుకొండలవాడి దివ్య ప్రసాదాలపై పుస్తకంలోని విశేషాలను శ్రీ రమణ దీక్షితులు ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఆ వివరాలు మరి మీకోసం ప్రత్యేకం...

 


దేవాది దేవుడు ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా తెలిపారు. అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ నేటికీ నిరంతరాయంగా జరుగుతుంది. ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే మాత్రమే ఉపయోగిస్తారు. పాలు గారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు అసలు వినియోగించరు. ప్రసాదం వండేవారు కూడా వంట సమయంలోగానీ, తర్వాతగానీ అసలు వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు వంటివారు. అంతేకాకుండా శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ వాటిని చూడకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: