బ్రహ్మచారి రూపంలో వచ్చిన శివుని పరీక్షలో పార్వతీదేవి విజయం సాధించింది. పరమేశ్వరుడు ప్రసన్నుడై నిజరూపం ధరించగా, శంకరుని స్వచ్చమైన రూపాన్ని చూసి, సిగ్గుల మొగ్గగా మారింది పార్వతి. అప్పుడు శివుడు ఆమెతో పార్వతీ.. నీ తపస్సుతో నన్ను గెలుచుకొన్నావు. కనుక, నేనిప్పుడు నీ ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించవలసిన వాడను అంటాడు. ఆ మాటలకు పార్వతి తాను తపస్సులో అనుభవించిన కష్టమంతా మరిచి ఆనందపరవశురాలైంది.. అలా పార్వతిదేవి తాను శివుడిలో అర్ధభాగమైంది..

 

 

ఇకపోతే కార్యసాధన కోసం ఎంత కష్టపడ్డా ఆ కార్యం సఫలం కాగానే, పడిన కష్టం మాయమైపోతుంది. ఆ ఉత్సాహంతో మళ్లీ ముందుకు సాగే శక్తి లభిస్తుంది.  అందుకు ఈ ఉదాహరణను చూస్తే.. ఒక రైతు భూమిని సిద్ధం చేసి, ఎరువులు వేసి, తొలి వర్షం పడగానే దుక్కి దున్ని, విత్తనాలు చల్లుతాడు. అవి మొలకెత్తిన దగ్గర్నుంచీ అహరహం శ్రమిస్తూ అతి శ్రద్ధగా పైరును సాకుతూ ఫలసాయం పొందుతాడు. అప్పుడా రైతు తాను పడ్డ కష్టాన్నంతా మరిచిపోయి ఆనందపరవశుడౌతాడు. ఆ ఉత్సాహం అతనికి వేయి యేనుగుల బలాన్నిస్తుంది. మళ్లీ వ్యవసాయ కార్యక్రమంలో నిమగ్నమవుతాడు.

 

 

నిజానికి ఈ విధానం కష్టంతో విజయాన్ని సొంతం చేసుకున్న ప్రతి వారికి వర్తిస్తుంది.. కానీ తేరగా ఇతరుల పొట్టలు కొట్టి సమకూర్చుకునే వారిని ఆ భగవంతుడు అసలు క్షమించడు.. అంతెందుకు ఒక తల్లిని తీసుకుంటే తొమ్మిది మాసాలు గర్భస్థ శిశువును సంరక్షించడానికి అష్టకష్టాలూ భరిస్తూ, ప్రసవ సమయంలో పురుటి నొప్పులతో అల్లాడిపోతుంది. కానీ ఆఖరున పండంటి బిడ్డకు జన్మను ఇవ్వగానే, అప్పటి వరకు తాను పడ్డ శ్రమనంతా మరిచిపోయి,అప్పట్నుంచీ తన బిడ్డ రక్షణను గురించే ఆరాటపడుతుంటుంది..

 

 

ఇదే కదా ఈ ప్రకృతి మనుషులకు ఇచ్చిన గొప్ప వరం.. అందుకే చేసే పని ఏదైనా అందులో సఫలం అయినవారే జగ్గజేత.. నిజమైన కార్యసాధకుడికి ఎప్పుడు ఓటమి ఉండదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: