బోనాల నిర్వ‌హ‌ణ‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. క‌రో్నా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఎలా నిర్వ‌హించాల‌న్న దానిపై అటు ప్ర‌భుత్వం ఇటు ఆల‌యాల నిర్వాహాకులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు. అయితే చివ‌రికి నిరాండ‌బ‌రంగా నిర్వ‌హించాల్సిందేన‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు ఇటీవ‌ల దేవాదాయ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి సైతం నిర్వాహాకుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. అధికారుల‌కు కూడా మార్గ‌నిర్దేశ‌కాలు జారీ చేశారు. ఈమేర‌కు జూన్ 25 నుంచి జులై 26 వరకు అమ్మవారికి బోనాల సమర్పణ ఉంటుందని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయ కమిటీ స్పష్టం చేసింది. భ‌క్తులు ప్ర‌భుత్వం సూచించిన నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ మొక్కులు స‌మ‌ర్పించాల్సి ఉంటుందని తెలిపింది.

 

లాల్ దర్వాజా మహంకాళి దేవాలయ కమిటీ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో అలయకమిటి ప్రతినిధులు లక్ష్మీ నారాయణ, అరవింద్ కుమార్ గౌడ్, బల్వంత్ యాదవ్, వెంకటేష్ లు వివరాలు వెల్లడించారు. వర్షాకాలంలో వచ్చే మహమ్మారి అంటువ్యాధుల నుండి రక్షించాలని ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అమ్మవారి అలయాల్లో అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితిగా వస్తుందన్నారు.. రోజు రోజుకు కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కబలిస్తుందని, ఈ విపత్కర సమయాల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ లు దరిస్తూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తే కరోనా నుంచి బయటపడవచ్చన్నది ఆశాభావం వ్యక్తం చేశారు.. అప్పట్లో అమ్మవారికి బోనాలు సమర్పించాకే కలరా వ్యాధి విజృంభన తగ్గిందని చారిత్రాత్మక నేపాధ్యాన్ని గుర్తుచేశారు. 

 

ప్రతి రోజు 50మంది మహిళలు చొప్పున అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని చెప్పారు. జులై 19, 20 తేదీ లలో మాత్రమే రాష్ట ప్ర భుత్వ నియమ నిబంధనల మేరకు అమ్మవారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి బోనాలు ఆలయ పూజారి మాత్రమే సమర్పిస్తాడాని స్పష్టం చేశారు. ఆ రెండు రోజులు భక్తులకు ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబోమన్నారు. ఆలయం వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని, మాస్క్ లు భౌతిక దూరాన్ని ఖచ్చితంగా అమలుచేస్తామన్నారు. బోనాలు తీసుకు వచ్చే మహిళల కోసం జీహెచ్ ఎంసీ ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య పనులు, బ్లీచింగ్, శానిటైజేషన్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: