ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి, దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును. మిధున, కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారు తగు గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప, దానాదులను చేసుకోవాలి.

 

ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర, బెల్లం, గోధుమలు కలిపి ఆవునకు తినిపించాలి. గోమాత మనం పెట్టిన గ్రాసం తినేప్పుడు గో మాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి.

 

ఇంటికి, వ్యాపార సంస్థలకు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను, పట్టికను, కలబందను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజింప జేసుకుని ఇంటికి, వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.

 

గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి, కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి, కాబట్టి తిరిగి మనకు మన కుంటుబ సభ్యుల కొరకు ఇంటికి మరియు వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కొత్తగా రక్షణ కట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: