అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో విశిష్టత కలిగినది. ఎంతమందికి అన్నదానం చేస్తే అంత పుణ్యఫలం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాంటివి అన్నంతో దేవుడికి అన్న పూజ చేస్తారని మీకు తెలుసా...? అవును చాలామంది దేవుళ్ళకి అన్న పూజ కార్యక్రమం చేస్తారు. ఇక అసలు శివుడి కి అన్న పూజ ఎలా చేస్తారు...? ఎందుకు చేస్తారు ...? అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం..

 

 

అన్నం పరబ్రహ్మ స్వరూపమనీ, పరమాత్మకు ప్రీతిపాత్రమనీ వేద వాఙ్మయం లో చెప్పబడింది. ఎవరి ఇష్టదైవానికి సరే అన్నంతో అర్చన చేయటమే అన్నపూజ. అలాంటి అన్నంతో ఎవరి వారి ఇష్ట దైవాన్ని ఆరాధించడమే అన్నపూజ కార్యక్రమం. అన్నంతో అభిషేకం చేస్తూ అన్నసూక్తం పఠించడం ఓ సంప్రదాయం.

IHG

 

 

ఆ తర్వాత అన్న సంతర్పణ చేస్తారు వారు. అసలు ఇందులోని అసలు విషయం ఏమిటంటే అన్నాన్ని దైవంగా చూడటం, అందరికీ అన్న దానం చేయడం దైవారాధనగా భావించటమూ ఈ విధానంలోని అసలైన ఆంతర్యం...

IHG

 

అసలు ఈ అన్నాభిషేకంలో అన్నమే అసలైన పూజాసామగ్రి. పసుపు, కుంకుమలూ, పూజాపుష్పాలూ అన్నీ కూడా అన్నమే. ఇక ఈ కార్యక్రమం లో ఆవాహనం, ధ్యానం, ఆసనం మొదలైన షోడశోపచారాలను సమర్పించి... అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి ఆధారంగా అర్చనతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

 

IHG

 

ఇకపోతే ఆదిశక్తీశ్వరుడైన పరమశివుడికి అన్నపూజ నిర్వహిస్తే కనుక కర్తకు ఎల్లపుడు అన్నపానాదులకు లోటుండదని అందరి విశ్వాసం. కాబట్టి భక్తులు అన్నపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: