హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. శైవంలో శివుడిని పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు శివుడు. శివుడిని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు. మానవులు తమ జీవనంలో శాస్త్రాలను విశ్వసిస్తూ ఉంటారు. ఇప్పటికే శాస్త్రాల మీద పరిశోధకులు అనేక పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు చేసిన పరిశోధకులు కొన్ని తప్పులు చేస్తే శివునికి కోపం వస్తుందని చెబుతున్నారు. 
 
 
మనలో కొంతమంది పూజలు చేసినా, నోములు నోచినా అనుకున్న ఫలితం దక్కదు. మనుషులు చేసిన తప్పుల వల్లే దేవుడు వాళ్ల కోరికలను తీర్చడని శివ పురాణం చెబుతోంది. కొన్ని సందర్భాల్లో మనుషులు చేసే తప్పులు ఏ విధంగా ఉంటాయంటే దేవునికి సైతం కోపం వస్తుంది. ముఖ్యంగా కొన్ని లక్షణాలు ఉన్నవారిని దేవుడు అస్సలు క్షమించడని శివపురాణంలో పేర్కొన్నారు. 
 
వేరే వారి ధనం ఆశించినా, పరాయి స్త్రీని ఆశించినా, తల్లిదండ్రులను గౌరవించకపోయినా, దొంగతనం చేసినా వారిని శివుడు అస్సలు క్షమించడు. వారు ఎన్ని పూజలు, హోమాలు చేసినా వ్యర్థమే. అమాయకమైన వారిని బాధపెట్టడం, వేరే వారి ధనాన్ని తప్పుడు మార్గంలో పొందడం, ఆలయంలో దొంగతనం చేయడం, గురువు భార్యతో సంబంధం పెట్టుకోవడం, ఎవరికైనా కష్టం, నష్టం కలిగించే పనులు చేసినా శివునికి కోపం వస్తుంది. 
 
ఇలాంటి తప్పులు చేసేవారిని పరమేశ్వరుడు ఎప్పటికీ క్షమించడని.... వారికి కష్టాలు వస్తూనే ఉంటాయని శివపురాణంలో ఉంది. ఈ గుణాలను మనం వదులుకుంటే మాత్రమే శివుని అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎవరైతే సద్గుణాలతో శివుని కృప కోసం ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుంది. శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు. మనం సద్గుణాలను కలిగి ఉండి కోరికలను కోరుకుంటే ఆ పనులలో విజయం తప్పక సొంతమవుతుంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: