ఆషాఢమాసన వచ్చే తొలి ఆషాడ శుద్ధ ఏకాదశినే  తొలి ఏకాదశి పండగ అంటారు. దీనినే మనం పేలాల పండగ అని కూడా అంటాము. విష్ణు మూర్తికి అత్యంత ప్రీతి పాత్రమైన పండగ తొలి ఏకాదశి. అసలు ఈ తొలి ఏకాదశి నోము అనేది ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. అందుకే ఈ నోము ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

 

ఏకాదశి వ్రతం చేసిన వారికీ సకల అష్ట ఐశ్వర్యాలు,  ఆరోగ్యము వస్తుందట. అయితే ఈ వ్రతం ఆచరించే వారు ఏకాదశికి ముందు రోజు అంటే దశమిరోజు రాత్రి పూట భోజనం చేయకూడదు.నియమ నిభంధనలతో శుచిగా, ఉపవాసం ఉండాలి. అయితే  ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు అన్నం తినకుండా  పండ్లు పాలు తీసుకోవచ్చు. మరుసటి రోజు అంటే తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి.

 

పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.దానితో పాటు మొక్కజొన్నల పిండి అంటే పేలాల పిండిని కూడా దేవునికి ఫలహారంగా పెట్టాలి. వ్రతం చేసేవాళ్ళు మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయాల సందర్శన, పూజలు, స్తోత్ర పారాయణాలు చేయాలి.వీలైతే తప్పక గోపూజ చేయండి. మన హిందువులు గోమాతని  పూజించడం ఆనవాయితీ. గోపూజ చేయడం ద్వారా మంచి ఫలితం వుంటుంది.ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. వీలుకాకుంటే నిద్రపోయే వరకు విష్ణునామస్మరణ చేసుకోండి.

 

 

రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు ద్వాదశి పారణ చేయాలి.అంటే ఏకాదశి రోజున వ్రతం ఆచరించి మరుసటి రోజున హరినామా పారాయణం చేసి వ్రతం ముగిస్తారు.నేడు దాన ధర్మాలు, అలాగే ముత్తయిదువులకు భోజనం పెడితే  పుణ్యం చేకూరుతుందని  విశ్వాసం. అందుకే ఈరోజు విందు భోజనం సిద్ధం చేసి దానం చేస్తారు.  సాక్షాత్తు ఈ బోజనము నారాయునిడికే పెట్టినట్లు భావిస్తారు. అయితే ఇంకో విషయం  ఈ ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు , మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పండితులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: