తొలి ఏకాదశి హిందువులకు పరమ పవిత్రమైన పండుగ. శ్రీ మహావిష్ణువు పాల కడలిపై నిద్రించే రోజు ఇది. దేవతలకు పగలు అంటే మనకు  ఆరు నెలలు.అదే వారికీ  రాత్రి అంటే మనకు మరో ఆరు నెలలు.అంటే  పగలు పూర్తయిపోయి రాత్రి శేషతల్పంపై శ్రీమహావిష్ణువు నిద్రించే రోజు ఈ తొలి ఏకాదశి.  ఈ రోజు విష్ణుమూర్తి పూజలు చేసి ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతారు కానీ దశమిరోజు, ద్వాదశి రోజు  శరీరానికి శక్తినిచ్చేలా  ఆహారం తీసుకోవడం ఎక్కువ మంది చేస్తుంటారు.

 

ఇందులో ఎక్కువగా మునగాకు వంటలు బెల్లం వంటకాలు ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా సరే... పేలాల పిండితో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించి తీసుకోవడం ఆనవాయితీ. జొన్నలు,  మొక్కజొన్నలు, గోధుమలు, కొర్రలు ఎలా ఏ ధాన్యాన్ని అయినా పేలాలులా వేయించి పొడికొట్టి వాటితో బెల్లాన్ని  కలిపి లడ్డూలు చేయడం లేదా అలాగే పొడిపొడిగా తినటం ఆనవాయితీగా వస్తుంది. అలాగే బెల్లంతో చేసిన వంటకాలను కూడా ఈ రోజు విష్ణుమూర్తికి నైవేద్యంగా పెడతారు.అలాగే ఆషాడ మాసంలో మునగాకు తినాలని అంటారు.ఎందుకంటే  చల్లని వనాల వలన శరీరంలో వేడి తగ్గిపోయి  జలుబు, దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది మునగాకు.

 

 

అలాగే పేలాల పిండిని కూడా కచ్చితంగా తినాలి అంటారు దీని వెనుక కూడా ఒక ఆరోగ్య రహస్యం ఉంది.అది ఏంటంటే పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతి పాత్రమైనవి.అలాగే మనకు జన్మ ఇచ్చిన పూర్వీకులను కనీసం ఈరోజన్నా తలుచుకోవడం ముఖ్యం.అలాగే వాతావరణం పరిస్థితులలో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్య పరమైన మార్పులు సంతరించుకుంటుంది.

 

వర్ష ఋతువు ప్రారంభం అయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తాయి. అందువల్ల ఈరోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: