హైద‌రాబాద్‌లోని ఉజ్జ‌యిని బోనాల వేడుక‌ల‌ను నిరాడంబ‌రంగా జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.  జులై 10 నుంచి 13వ తేదీ వ‌ర‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌మ‌ని చెప్పారు ఆల‌య నిర్వాహ‌కులు. ఈ సారి ఇండ్ల‌లోనే బోనం స‌మ‌ర్పించుకోవాల‌ని భ‌క్తుల‌కు సూచించారు. ఏటా ఎంతో వైభ‌వంగా జ‌రిగే సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి బోనాల పండుగ ఈ సారి నిరాడంబ‌రంగా జ‌ర‌గ‌నుంది. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ దృష్ట్యా ఈ ఏడాది మ‌హంకాళి ఆల‌యంలోకి భ‌క్తుల‌కు అనుమ‌తి లేదని తెలిపారు ఆల‌య అధికారులు. ఆల‌య పూజారులు, సిబ్బంది మాత్ర‌మే అమ్మవారికి బోనం స‌మ‌ర్పించి, పూజ‌లు నిర్వ‌హిస్తారన్నారు. 

 

ప్రతి ఏడాది ఆనవాయితీగా జరిగే పూజలు సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామని, బోనాల వేడుకలను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. వచ్చే శుక్రవారం, ఆదివారం, సోమవారాల్లో భక్తులకు ప్రవేశం లేదన్నారు. ఆదివారం నాటి పూజలు, సోమవారం జరిగే రంగం యధావిధిగా కొనసాగుతుందని చెప్పారు ఆల‌య నిర్వాహ‌కులు. రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన లష్కర్ బోనాలకు చారిత్రక నేపద్యం ఉంది. కలర , ప్లేగు వంటి వ్యాదులతో ప్రజలు మృతి చెందుతుండటంతో మహంకాళి అమ్మవారిని తమ గ్రామ దేవతగా ప్రజలు కొలవటం ప్రారంభించారు. నగరంలో గోల్కొండ బోనాల తరువాత అంతే స్థాయిలో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది.

 

 బ్రిటిష్ కాలంలో కాంట్రాక్టర్‌గా ఉన్న నగరవాసి ఉజ్జాయినిలో పనులు నిర్వహించేవాడు ఈ క్రమంలో తమ ప్రాంతంలో కలర, మసూచి, ప్లేగు వంటి రోగాలు వచ్చి ప్రజలు చనిపోతు ఉంటే తమ గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడితే తమ గ్రామ దేవతగా కొలుస్తామని మొక్కుకున్నాడట. ఉజ్జాయినిలో అమ్మవారికి మొక్కుకున్నాడు కాబట్టి ఆదే పేరుతో ఉజ్జాయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు చేయడం మొదలు పెట్టరు. అప్పట్లో హైదరాబాద్ సంస్థానానికి ఆమడ దూరంలో లష్కర్ ఓ చిన్న గ్రామంగా ఉండేది. కాలక్రమంలో హైదరాబాద్,లష్కర్‌లు కలిసిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: