గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు.వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. మనిషి పుట్టింది మొదలు అనేక సందర్భాల్లో అనేక మంది గురువుల వద్ద అనేక విషయాలను నేర్చుకుంటుంటాడు. మొదట తల్లిదండ్రులు గురువులుగా మారి మాటలు, నడక నేర్పిస్తే.. ఆ తరువాత గురువులు మనకు విద్యాబుద్ధులు నేర్పి మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తారు.అయితే అంతటి గురువులను పూజించడానికి ఓ రోజు ఉండడం, దాన్ని గురుపూర్ణిమగా జరపుకోవడం, ఆరోజున గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఝానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది.


హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు.శిష్యులకు ఆయన జ్ఞానాన్ని, వెలుగును ప్రసాదిస్తాడు. పురాణాల ప్రకారం దేవతల గురువు బృహస్పతి కాగా.. ఆయన సప్తరుషుల్లో ఒకడైన అంగీరసుడి పుత్రుడు. బృహస్పతి బాల్యంలోనే మహా పండితుడిగా కీర్తింపబడ్డాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యాడు. వేదాలను అవపోసన పట్టి, శాస్ర్తాలను లోతుగా పరిశీలించి అన్ని విధాలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.బృహస్పతి పరమేశ్వరున్ని పూజించి ఆయన మెప్పు పొందాడు.


 అందుకనే గురువారం బృహస్పతిని స్మరిస్తూ నామకరణం చేయబడింది.హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.అలాగే  లోకానికి అంతటికి జ్ఞానాన్ని అందించిన గురువు వేదవ్యాసుడు.  వేదవ్యాసుని  మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు.  


వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. మాములు రోజుల్లో కన్న ఈరోజున ఈ గురుపౌర్ణమి నాడు గురువు నుంచి  వెలువడే  ఆశీర్వచనాలు వేయి రేట్లు ఎక్కువగా పొందవచ్చునట..

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: